అవిసె నూనెతో ఆరోగ్యం

అవిసె గింజ‌ల నుంచి త‌యారు చేసే నూనెతో అనేక ఉప‌యోగాలున్నాయ‌ని నిపుణులంటున్నారు.  అవిసె నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి, మధుమేహం, క్యాన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు.  సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.
  • ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లభిస్తుంది.
  • చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.
  • అధిక తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం.
  • నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుంది.
  • అవిసె నూనెలో విటమిన్ ‘ఈ’ పుష్కలంగా ఉంది. కుష్టువ్యాధితో బాధపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
  • కాలిన గాయాలపై అవిసె నూనె నుర‌గ‌ను పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలగుతుంది. అవిసె ఆకును వేంచుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆలేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మటుమాయమవుతాయి.