Telugu Global
Cinema & Entertainment

ప్రియమణితో పట్నాయక్ మూవీ

చాన్నాళ్లుగా తెలుగుతెరపై కనిపించలేదు ప్రియమణి. టాలీవుడ్ లో దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించిన ప్రియమణి ఇప్పుడు ఫేడవుట్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది ప్రియమణి. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ప్రియమణి ఓ సినిమా చేస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియదు కూడా. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ […]

ప్రియమణితో పట్నాయక్ మూవీ
X
చాన్నాళ్లుగా తెలుగుతెరపై కనిపించలేదు ప్రియమణి. టాలీవుడ్ లో దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించిన ప్రియమణి ఇప్పుడు ఫేడవుట్ స్టేజ్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది ప్రియమణి. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ప్రియమణి ఓ సినిమా చేస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియదు కూడా. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రతిక్షణం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో లేడీఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది ప్రతిక్షణం. కథ తనకు ఎంతో ప్రేరణ కలిగిస్తే తప్ప సినిమాగా తీయనని చెప్పుకునే ఆర్పీ పట్నాయక్, ప్రతిక్షణం సినిమాను తన లైఫ్ టైం బెస్ట్ మూవీగా చెప్పుకొస్తున్నాడు. పైగా జాతీయ అవార్డు పొందిన ప్రియమణి లాంటి నటితో సినిమా చేయడం ఆనందంగా ఉందంటున్నాడు. ఇప్పటికే బ్రోకర్ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న ఆర్పీ, ప్రతిక్షణంతో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
First Published:  27 Jun 2015 8:30 PM GMT
Next Story