Telugu Global
Cinema & Entertainment

 సీతమ్మ'కు మాస్ లుక్..

హీరోయిన్ అంజలి ఇన్నాళ్లూ ఎలాంటి పాత్రల్లో కనిపించిందో మనందరికీ తెలుసు. స్వీట్ అండ్ కూల్ పాత్రల్లో మెప్పించింది. అలాంటి అంజలి రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది.. మ..మ.. మాస్ అంటూ రెచ్చిపోతే చూడాలనుకుందా.. త్వరలోనే అలాంటి పాత్రలో కనువిందు చేయబోతోంది సీతమ్మ అంజలి. ప్రస్తుతం శంకరాభరణం అనే సినిమాలో నటిస్తోంది అంజలి. నిఖిల్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో అంజలి మేనరిజమ్స్ పక్కా మాస్ యాంగిల్ లో ఉంటాయని సమాచారం. సినిమా […]

 సీతమ్మకు మాస్ లుక్..
X
హీరోయిన్ అంజలి ఇన్నాళ్లూ ఎలాంటి పాత్రల్లో కనిపించిందో మనందరికీ తెలుసు. స్వీట్ అండ్ కూల్ పాత్రల్లో మెప్పించింది. అలాంటి అంజలి రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది.. మ..మ.. మాస్ అంటూ రెచ్చిపోతే చూడాలనుకుందా.. త్వరలోనే అలాంటి పాత్రలో కనువిందు చేయబోతోంది సీతమ్మ అంజలి. ప్రస్తుతం శంకరాభరణం అనే సినిమాలో నటిస్తోంది అంజలి. నిఖిల్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో అంజలి మేనరిజమ్స్ పక్కా మాస్ యాంగిల్ లో ఉంటాయని సమాచారం. సినిమా కథేంటనేది తెలియకపోయినప్పటికీ.. అంజలి క్యారెక్టర్ మాత్రం మాస్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర చిత్రీకరణను ఇటీవలే పూణెలో కొంత పూర్తిచేశారు. త్వరలోనే బీహార్ తోపాటు ఉత్తరభారతంలోని మరికొన్ని లొకేషన్లలో అంజలితో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కొన వెంకట్ అందించిన ఈ కథకు ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నాడు.
First Published:  29 Jun 2015 12:55 AM GMT
Next Story