బాహుబ‌లి గిన్నిస్ రికార్డు..! 

తెలుగు ప్రాంతీయ భాష‌.   సినిమా మార్కెట్ ప‌ర‌మితం.  నిర్మాత సేఫ్ జోన్ లో ఉండాలంటే చాల ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమా చేయాలి.  ఇది సూత్రం. కానీ..  ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్న‌ట్లు  .. బాహుబ‌లి సినిమాను చేశాడు.  మ‌న మార్కెట్ కు ..ఆ సినిమా బ‌డ్జెట్ కు ఎక్క‌డ పొంత‌న వుండ‌దు.  రెండు వంద‌ల కోట్లు అంటే బాలీవుడ్ లో  స్టార్ హీరోల‌కు వ‌ర్కువుట్ అయ్యే  రేంజ్.

కానీ మ‌న ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న  బాహుబ‌లి సినిమాకోసం. ఫీల్మ్  బిజినెస్ ఎక్స్ ప‌ర్ట్ కూడా అయ్యాడు. సినిమా బ‌డ్జెట్ ను మించి అప్పుడే  నిర్మాత‌ను సేఫ్ జోన‌ల్ లో వుంచిన‌ట్లు  టాక్ వినిపిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, హింది,  క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో  బాహుబ‌లి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.  ప్రాజెక్ట్ కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కోట్ల రూపాయాలు క‌లిసొచ్చే  విదంగా ఫ్రీ ప్ర‌చారం క‌ల్పించాడు.  రానా, ప్రభాస్,  అనుష్క‌,  త‌మ‌న్నా ,   లీడ్ రోల్స్  అంద‌రి సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను అలెర్ట్ చేసి  సాధ్య‌మైనంత ప్ర‌చారం క‌ల్పించారు.

ఇక  తాజాగా  గిన్నిస్ బుక్ రికార్డ్స్  లో  బాహుబ‌లి పోస్ట‌ర్ ను  నిలిపాడు. బాహుబలి’ మలయాళ వెర్షన్‌ ఆడియో(శనివారం) కేరళలో జరిగింది. ఈ సందర్భంగా కొచ్చిలో ఓ భారీ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ పోస్ట‌ర్  51,968.32 చ‌ద‌ర‌పు అడుగుల  భారీ పోస్ట‌ర్. ఇది ప్రపంచంలోనే అతి పెద్దపోస్టర్‌ అట. ఈ పోస్టర్‌ని చూడటానికి గిన్నిస్‌బుక్‌ ప్రతినిదులు వస్తున్నారని తెలుస్తోంది. వాళ్లు గనుక ఇదే అత్యంత పెద్ద పోస్టర్‌ అని భావిస్తే ‘బాహుబలి’ గిన్నిస్‌బుక్‌ ఎక్కేస్తుంది. దీంతో సినిమా విడుద‌ల‌కు ముందు ఈ ప్ర‌చారం   దేశ‌వ్యాప్తంగా మ‌రింత ప్ల‌స్ అయిన‌ట్లే క‌దా..!