Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ బాబు ఒక్క‌డితో బండి న‌డ‌వ‌దా..?

స్టార్ హీరోలైన స‌రే ..  హీరోయిన్స్ ఇద్ద‌రు వుండేలా చూసుకోవ‌డం  సాధ‌ర‌ణం అయ్యింది.  ఒక‌ప్పుడు ఇద్ద‌రు హీరోయిన్స్ చేయ‌డం అంటే..  క‌థ డిమాండ్ చేస్తే త‌ప్ప చేసే వారు కాదు. కానీ  ఇప్ప‌టి జ‌న‌రేష‌న్  ఫిల్మ్ మేక‌ర్స్  ఆ ట్రెండ్ ను మార్చేశారు.  హీరో  సెంట్రిక్ గా క‌థ‌ను అల్లుకోవ‌డం…  ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల్ని  ఎంపిక చేసి  స్క్రీన్ పై  సాధ్య‌మైనంత వ‌ర‌కు  హుషారు పుట్టించ‌డం అనే చందంగా బండి న‌డిపిస్తున్నారు. అయితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ […]

మ‌హేష్ బాబు ఒక్క‌డితో బండి న‌డ‌వ‌దా..?
X

స్టార్ హీరోలైన స‌రే .. హీరోయిన్స్ ఇద్ద‌రు వుండేలా చూసుకోవ‌డం సాధ‌ర‌ణం అయ్యింది. ఒక‌ప్పుడు ఇద్ద‌రు హీరోయిన్స్ చేయ‌డం అంటే.. క‌థ డిమాండ్ చేస్తే త‌ప్ప చేసే వారు కాదు. కానీ ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఫిల్మ్ మేక‌ర్స్ ఆ ట్రెండ్ ను మార్చేశారు. హీరో సెంట్రిక్ గా క‌థ‌ను అల్లుకోవ‌డం… ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల్ని ఎంపిక చేసి స్క్రీన్ పై సాధ్య‌మైనంత వ‌ర‌కు హుషారు పుట్టించ‌డం అనే చందంగా బండి న‌డిపిస్తున్నారు. అయితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరోతో మంచి ఫ్యామిలీ డ్రామ ను పండించి… అత్తారింటికి దారేది చిత్రంతో త్రివిక్ర‌మ్ బాక్సాఫీస్ ను అరిపించాడు.

ఇక ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల అంటే ఫీల్ గుడ్ స్టోరిస్ చేయడంలో త‌న మార్కెంటో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంతో చూపించాడు. తాజ‌గా మ‌హేష్ బాబు తో బ్ర‌హ్మోత్సవం అనే సినిమాను ప్లాన్ చేశారు.మే 31న ప్రాజెక్ట్ లాంచ‌నంగా ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది. మ‌హేష్ బాబు తో అల్రేడి దూకుడు , సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాలు చేసిన స‌మంత‌.. బిబినెస్ మెన్ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న చేసిన కాజ‌ల్ తో పాటు.. తొలిసారిగా ప్ర‌ణీత ప్రిన్స్ తో జ‌త క‌ట్టునుంద‌ట‌. ఏమిటో స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్స్ ను తీసుకుంటూ కొత్త ట్రెండ్ ను క్రియోట్ చేస్తున్నారు. చూస్తుంటే..ఇదంతా ఒక్క హీరోయిన్ ను తీసుకుని స్టార్ హీరోల‌తో కూడా క‌థ‌ను న‌డిపించ లేక పోతున్నార అనే సందేహాల‌కు తావిస్తుంది..?

First Published:  28 Jun 2015 4:00 PM GMT
Next Story