Telugu Global
Others

ఆ న‌లుగురూ ప‌ద‌వుల నుంచి తొల‌గాల్సిందే: ఆప్‌

కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, స్మృతీ ఇరానీ, రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మంత్రి పంకజ్‌ముండే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది. సోమవారం ఢిల్లీలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు బీజేపీ మహిళా నేతలు వెంటనే రాజీనామా చేయాలంటూ ఆప్‌ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఢిల్లీ వీథుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆప్‌ […]

ఆ న‌లుగురూ ప‌ద‌వుల నుంచి తొల‌గాల్సిందే: ఆప్‌
X
కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, స్మృతీ ఇరానీ, రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మంత్రి పంకజ్‌ముండే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేసింది. సోమవారం ఢిల్లీలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు బీజేపీ మహిళా నేతలు వెంటనే రాజీనామా చేయాలంటూ ఆప్‌ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఢిల్లీ వీథుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆప్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లలిత్‌మోడీకి సహకరించారన్న ఆరోపణలు కేంద్రమంత్రి సుష్మా, రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజేను చుట్టుముట్టాయి. నకిలీ విద్యార్హత కేసులో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చిక్కుకుంటే మహరాష్ట్ర మంత్రి పంకజ్‌ ముండేపై 206 కోట్ల విలువ చేసే అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాంతో వారికి వ్యతిరేకంగా ఆప్‌ పార్టీ ఆందోళన నిర్వహించింది. బీజేపీ మహిళా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శించారు.
First Published:  29 Jun 2015 9:39 PM GMT
Next Story