Telugu Global
NEWS

నేత కార్మికుల‌కు జనతా వస్ర్తాలతో ఉపాధి

రాష్ట్ర విభజన అనంతరం ఆప్కోను వేరు చేసేందుకు కేంద్రకమిటీకి నివేదిక అందచేశామని, ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా కల్పించామన్నారు. అదే నిష్పత్తిలో ఆస్తులు, అప్పులు పంపకం జరుగుతుందని ఆప్కో చైర్మన్‌ మురుగుడు హనుమంతరావు తెలిపారు. జనతా వస్ర్తాల ద్వారా త్వరలో సొసైటీలకు పని కల్పించి చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హనుమంతరావు తెలిపారు. స్థానిక ఆరుంబాక చేనేత కోఆపరేటివ్‌ సొసైటీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార […]

నేత కార్మికుల‌కు జనతా వస్ర్తాలతో ఉపాధి
X
రాష్ట్ర విభజన అనంతరం ఆప్కోను వేరు చేసేందుకు కేంద్రకమిటీకి నివేదిక అందచేశామని, ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా కల్పించామన్నారు. అదే నిష్పత్తిలో ఆస్తులు, అప్పులు పంపకం జరుగుతుందని ఆప్కో చైర్మన్‌ మురుగుడు హనుమంతరావు తెలిపారు. జనతా వస్ర్తాల ద్వారా త్వరలో సొసైటీలకు పని కల్పించి చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హనుమంతరావు తెలిపారు. స్థానిక ఆరుంబాక చేనేత కోఆపరేటివ్‌ సొసైటీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘాల పనితీరు, స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జనతా వస్ర్తాలను అందించే ఆలోచన చేస్తుందన్నారు. కొన్ని సొసైటీల్లో మగ్గాలు అధికంగా ఉన్నప్పటికీ పనులు కల్పించలేకపోతున్నాయన్నారు. జనతా వస్ర్తాల తయారీ సొసైటీలకు అప్పగించటం ద్వారా ప్రతి కార్మికుడికి పని కల్పించవచ్చన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 212 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని, త్వరలో చేనేత కార్మికులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. సహకార సంఘాల రుణ మాఫీకి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ఆప్కోకు ప్రభుత్వం నుంచి 170 కోట్లు రావాల్సి ఉందని, ప్రభుత్వం ఆ మొత్తాన్ని అందిస్తే సొసైటీలకు బకాయిలను చెల్లిస్తామన్నారు. చేనేత కార్మికుల మజూరీ పెంచాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
First Published:  29 Jun 2015 11:31 PM GMT
Next Story