బొగ్గు మ‌కిలి మన్మోహ‌న్‌దే… నాది కాదు: దాస‌రి

బొగ్గు కుంభ‌కోణంలో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని మాజీ కేంద్ర మంత్రి దాస‌రి నారాయ‌ణ‌రావు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో సీబీఐ కోర్టు ముందు హాజ‌ర‌య్యారు. తాను కేవ‌లం స‌హాయ మంత్రిని మాత్ర‌మేన‌ని, ఆప్ప‌టి నిర్ణ‌యాల‌న్నీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్‌సింగే తీసుకున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ కేసుతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని తెలిపారు. అస‌లు దోషుల్ని వ‌దిలి త‌నను ప్ర‌శ్నించ‌డం స‌బ‌బు కాద‌ని దాస‌రి సీబీఐ అధికారుల‌తో వాదించారు.