Telugu Global
Cinema & Entertainment

ఈటీవీ పండక్కి పవన్ ప్రత్యేకం

సాధారణంగా ఎలాంటి ఫంక్షన్లకు హాజరవ్వడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడడు. ఫంక్షన్ ఎంతో ప్రత్యేకమైంది, తనను ఆహ్వానించినవాళ్లు సమ్ థింగ్ స్పెషల్ అనుకున్నప్పుడు మాత్రమే ఫంక్షన్లకు హాజరవుతుంటాడు. చివరికి సొంత అన్నకొడుకు రామ్ చరణ్ సినిమా ఫంక్షన్లకు కూడా ఎటెండ్ అవ్వడానికి ఇష్టపడడు పవర్ స్టార్. అలాంటి పవన్ ఈమధ్య ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు పవన్ కల్యాణ్. కేవలం రామోజీ రావు ఆహ్వానించారనే ఒకేఒక్క కారణంతో ఆ ఫంక్షన్ […]

ఈటీవీ పండక్కి పవన్ ప్రత్యేకం
X
సాధారణంగా ఎలాంటి ఫంక్షన్లకు హాజరవ్వడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడడు. ఫంక్షన్ ఎంతో ప్రత్యేకమైంది, తనను ఆహ్వానించినవాళ్లు సమ్ థింగ్ స్పెషల్ అనుకున్నప్పుడు మాత్రమే ఫంక్షన్లకు హాజరవుతుంటాడు. చివరికి సొంత అన్నకొడుకు రామ్ చరణ్ సినిమా ఫంక్షన్లకు కూడా ఎటెండ్ అవ్వడానికి ఇష్టపడడు పవర్ స్టార్. అలాంటి పవన్ ఈమధ్య ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. ఈటీవీ 20వ వార్షికోత్సవానికి ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు పవన్ కల్యాణ్. కేవలం రామోజీ రావు ఆహ్వానించారనే ఒకేఒక్క కారణంతో ఆ ఫంక్షన్ కు హాజరయ్యారు. రామోజీ ఫిలింసిటీలో అట్టహాసంగా జరిగిన ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఇంకా ఎక్కడా బయటకురాలేదు. త్వరలోనే ఈటీవీలో ఆ వేడుకను ప్రసారం చేస్తారు. అలాంటి అరుదైన, అంగరంగ వేడుకకు సంబంధించిన ఓ ఫోటోను సీనియర్ నరేష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టారు. ఈటీవీ వేడుకకు పవన్ చాలా ప్రత్యేకం అంటూ గుబురు గడ్డంతో ఉన్న పవన్ ఫోటో పోస్ట్ చేశారు. పక్కనే రామోజీరావు కూడా కనిపిస్తున్నారు. ఆ మధ్య పవన్ బాబాలా బాగా గడ్డం పెంచారు. ఆ టైమ్ లో ఈ ఫంక్షన్ కు హాజరయ్యారనే విషయం ఫోటో చూస్తేనే అర్థమౌతుంది.
First Published:  30 Jun 2015 12:33 AM GMT
Next Story