Telugu Global
NEWS

రేవంత్ బెయిల్‌పై సుప్రీంకు తెలంగాణ ఏసీబీ

ఓటుకు నోటు కేసులో కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని టిఎస్ ఏజీపీ అరుణ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు.బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు.  ఈ కేసు విచార‌ణ ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని, ఇటువంటి స‌మ‌యంలో బెయిల్ మంజూరు చేయ‌డం స‌రికాద‌ని ఏసీబీ అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో చ‌ట్ట ప్ర‌కారం బెయిల్ వ‌చ్చే […]

రేవంత్ బెయిల్‌పై సుప్రీంకు తెలంగాణ ఏసీబీ
X
ఓటుకు నోటు కేసులో కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని టిఎస్ ఏజీపీ అరుణ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు.బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ కేసు విచార‌ణ ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని, ఇటువంటి స‌మ‌యంలో బెయిల్ మంజూరు చేయ‌డం స‌రికాద‌ని ఏసీబీ అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో చ‌ట్ట ప్ర‌కారం బెయిల్ వ‌చ్చే ఛాన్స్ 99 శాతం లేద‌ని, కాని బెయిల్ మంజూరు కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని అడిష‌న‌ల్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ రామ‌చంద్ర‌రావు అన్నారు. కేసులో ప‌ట్టుబ‌డిన రూ. 50 ల‌క్ష‌లు ఎలా వ‌చ్చాయ‌ని, మ‌రో 4.50 కోట్ల రూపాయ‌లు ఎక్క‌డ నుంచి తెస్తార‌న్న విష‌యం తేలాల్సి ఉంద‌ని, ఈ సందేహాలేమీ తొల‌గ‌కుండానే బెయిల్ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని ఆయ‌న అన్నారు. అందుకే తాము సుప్పీంలో రేవంత్ బెయిల్‌ను స‌వాలు చేస్తామ‌ని తెలిపారు.
First Published:  30 Jun 2015 3:51 AM GMT
Next Story