Telugu Global
National

బీజేపీ స్వ‌చ్ఛ పాల‌న‌లో మ‌రో 'మ‌ర‌క‌'

భార‌తీయ జ‌న‌తాపార్టీ రోజుకొక్క స‌మ‌స్య‌లో చిక్కుకుపోతోంది. ఇప్ప‌టికే సుష్మా స్వ‌రాజ్‌, వ‌సుంధ‌ర రాజే, స్మృతి ఇరానీ, పంక‌జ్ ముండేతో త‌ల‌బొప్పి క‌ట్టిన బీజేపీకి కొత్త‌గా మ‌రొక‌రు ఇదే కోవ‌లో తార‌స‌ప‌డ్డారు. మ‌హారాష్ట్రకే చెందిన మ‌రో మంత్రి 191 కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో చిక్కుకుపోయారు. విద్యా శాఖ మంత్రి వినోద్ తాప్‌డే జిల్లా పరిష‌త్ స్కూళ్ళ కోసం అగ్ని మాప‌క ప‌రిక‌రాల కొనుగోలుకు టెండ‌ర్లు పిల‌వ‌కుండానే రూ. 191 కోట్ల విలువైన కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 62,105 […]

బీజేపీ స్వ‌చ్ఛ పాల‌న‌లో మ‌రో మ‌ర‌క‌
X
భార‌తీయ జ‌న‌తాపార్టీ రోజుకొక్క స‌మ‌స్య‌లో చిక్కుకుపోతోంది. ఇప్ప‌టికే సుష్మా స్వ‌రాజ్‌, వ‌సుంధ‌ర రాజే, స్మృతి ఇరానీ, పంక‌జ్ ముండేతో త‌ల‌బొప్పి క‌ట్టిన బీజేపీకి కొత్త‌గా మ‌రొక‌రు ఇదే కోవ‌లో తార‌స‌ప‌డ్డారు. మ‌హారాష్ట్రకే చెందిన మ‌రో మంత్రి 191 కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో చిక్కుకుపోయారు. విద్యా శాఖ మంత్రి వినోద్ తాప్‌డే జిల్లా పరిష‌త్ స్కూళ్ళ కోసం అగ్ని మాప‌క ప‌రిక‌రాల కొనుగోలుకు టెండ‌ర్లు పిల‌వ‌కుండానే రూ. 191 కోట్ల విలువైన కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 62,105 ప‌రిక‌రాల‌ను టెండ‌ర్లు పిల‌వ‌కుండానే కొన‌డానికి ప్రాథ‌మిక విద్యాశాఖ డైరెక్ట‌ర్ కార్యాల‌యానికి విద్యాశాఖ అనుమ‌తి ఇచ్చింది. ఈ కాంట్రాక్టుల‌ను వినోద్ తాప్‌డే అమోదించారు. ఆర్థిక శాఖ దీనికి అభ్యంత‌రం చెప్పింది. అయితే తాను అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, కాంట్రాక్ట‌ర్ల‌కు ఇంకా ఒక్క పైసా కూడా చెల్లించ‌లేద‌ని వినోద్ తాప్‌డే అంటున్నారు. మొత్తం మీద ఇదే రాష్ట్రం నుంచి పంక‌జ్ ముండే 206 కోట్ల రూపాయ‌ల విలువైన కుంభ‌కోణంలో చిక్కుకుని ఇంకా తేరుకోని స‌మ‌యంలో మ‌రో అవినీతి భాగోతం బ‌య‌ట‌ప‌డ‌డం బీజేపీ ప్ర‌భుత్వానికి ఇటు మ‌హారాష్ట్రలోను, అటు కేంద్రంలోనూ మ‌రో మాయ‌ని మరకే!
First Published:  1 July 2015 6:40 AM GMT
Next Story