Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా తొలి అడుగులు

ఓ సినిమా నిర్మిస్తానని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నాడు ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. అది ఇన్నాళ్లకు సాధ్యమౌతోంది. అవును.. రెహ్మాన్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి రెహ్మానే అన్నీ చూసుకుంటున్నాడు. స్వయంగా కథ-స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు. సంగీత ప్రాధాన్యమున్న ఓ కథతో పాటు తనే కథనం కూడా రాసుకున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతల్ని విశ్వేష్ కృష్ణమూర్తి అనే డైరక్టర్ కు అప్పగించాడు. వైఎమ్ మూవీస్ అనే బ్యానర్ […]

నిర్మాతగా తొలి అడుగులు
X
ఓ సినిమా నిర్మిస్తానని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నాడు ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. అది ఇన్నాళ్లకు సాధ్యమౌతోంది. అవును.. రెహ్మాన్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి రెహ్మానే అన్నీ చూసుకుంటున్నాడు. స్వయంగా కథ-స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు. సంగీత ప్రాధాన్యమున్న ఓ కథతో పాటు తనే కథనం కూడా రాసుకున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతల్ని విశ్వేష్ కృష్ణమూర్తి అనే డైరక్టర్ కు అప్పగించాడు. వైఎమ్ మూవీస్ అనే బ్యానర్ స్థాపించి, ఆ బ్యానర్ పై కొత్త సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాడు రెహ్మాన్. కథకు తగ్గట్టు నటీనటుల ఎంపిక బాధ్యతను దర్శకుడికి అప్పగించాడు. ప్రస్తుతం తను సంగీత దర్శకత్వంపై ఫోకస్ పెట్టాడు. సంగీత ప్రాధాన్యమున్న సినిమా కాబట్టి మూవీలో 10సాంగ్స్ పెట్టుకున్నాడు రెహ్మాన్. అందులో 5 పాటలకు ఇప్పటికే బాణీలు సమకూర్చాడు. మరో 5 పాటల్ని త్వరలోనే పూర్తిచేస్తానంటున్నాడు. సినిమాకు 99-పదలగళ్ అని పేరుపెట్టాడు రెహ్మాన్. అంటే 99 పాటలు అని అర్థం.
First Published:  30 Jun 2015 7:00 PM GMT
Next Story