ఈసారి వ‌రుణ్‌గాంధీపై ల‌లిత్‌మోడి బాంబు!

మొన్న సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై ఆరోప‌ణ‌లు చేసిన మాజీ ఐపిఎల్ ఛైర్మ‌న్ ల‌లిత్ మోడి ఇపుడు మేనకాగాంధీ కుమారుడు వ‌రుణ్‌గాంధీని టార్గెట్ చేశాడు. అవినీతి కేసుల్లో త‌నను త‌ప్పించేందుకు సోనియాగాంధీకి డ‌బ్బు ముట్ట‌జెప్పాల్సిందిగా త‌న‌కు సూచించాడ‌ని ల‌లిత్ త‌న ట్విట్ట‌ర్‌లో వ్యాఖ్యానించాడు. ఇలా ఈసారి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని టార్గెట్ చేసుకుని ట్విట్టర్‌లో పలు ఆరోపణలు గుప్పించాడు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గతంలో తనను కలుసుకోవడానికి లండన్‌లోని తన నివాసానికి వచ్చాడని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సోనియా గాంధీకి చెప్పి తనకు అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చాడ‌న్నారు.  “పెద్దమ్మ సోనియాకు రూ.384 కోట్లు ఇస్తే.. నిన్ను కేసుల నుంచి రక్షిస్తారు” అని వరుణ్‌ గాంధీ తనతో చెప్పారన్నారు. ఇందుకోసం ఇటలీలోని సోనియా గాంధీ సోదరిని కలవాలని వరుణ్ తనకు సూచించారని లలిత్ మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.