Telugu Global
International

బాలల కార్యక్రమాలకు యునిసెఫ్‌ అవార్డులు

బాలల వికాసం, అభివృద్ధిని నిరోధించే సమస్యలను పరిష్కరించేందుకు మీడియా ప్రముఖంగా కృషి చేయాలని ఐక్యరాజ్య సమితిలోని బాలల విభాగం యునిసెఫ్‌ పిలుపునిచ్చింది. ప్రతి యేడాది మాదిరిగానే బాలల మనుగడ హక్కును కాపాడే ఉద్దేశంతో టీవీ చానళ్లలో ప్రసారమయ్యే చిన్న పిల్లల కార్యక్రమాల్లో మెరుగైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తామని హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో యునిసెఫ్‌ తెలిపింది. జూలై 1 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు 100 రోజులపాటు టీవీ చానళ్లలో వచ్చే చిన్న […]

బాలల కార్యక్రమాలకు యునిసెఫ్‌ అవార్డులు
X
బాలల వికాసం, అభివృద్ధిని నిరోధించే సమస్యలను పరిష్కరించేందుకు మీడియా ప్రముఖంగా కృషి చేయాలని ఐక్యరాజ్య సమితిలోని బాలల విభాగం యునిసెఫ్‌ పిలుపునిచ్చింది. ప్రతి యేడాది మాదిరిగానే బాలల మనుగడ హక్కును కాపాడే ఉద్దేశంతో టీవీ చానళ్లలో ప్రసారమయ్యే చిన్న పిల్లల కార్యక్రమాల్లో మెరుగైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తామని హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో యునిసెఫ్‌ తెలిపింది. జూలై 1 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు 100 రోజులపాటు టీవీ చానళ్లలో వచ్చే చిన్న పిల్లల కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి అవార్డులు ప్రకటిస్తామని వెల్లడించింది. అవార్డు ప్రదానోత్సవాన్ని డిసెంబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నారు. ఉత్తమ వార్తాకథనం, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్య, రక్షణ, చిన్నారుల సమస్యలపై చర్చలు, ప్రజలకు అందిస్తున్న సమాచారం తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. అలాగే, జ్యూరీ తరపున ఒక స్పెషల్‌ అవార్డు కూడా ఇవ్వనున్నారు. అసక్తిగల వారు టీవీల్లో ప్రసారమయిన కథనాలను అవార్డుల కోసం పంపుకోవచ్చని యునిసెఫ్‌ తెలిపింది.
First Published:  1 July 2015 5:05 AM GMT
Next Story