Telugu Global
Others

న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డికి 3 నెల‌ల అవ‌కాశం 

విదేశాల్లో దాచిన ఉంచిన న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డికి కేంద్రం మూడు నెల‌ల గ‌డువు ఇచ్చింది. దీనిపై కొత్త చ‌ట్టం కింద విచార‌ణ‌ను త‌ప్పించుకునేందుకు సెప్టెంబ‌రు 30 దాకా అవ‌కాశం క‌ల్పించింది. విదేశీ ఆస్తుల‌కు సంబంధించిన పన్నులు, జ‌రిమానాలు చెల్లించేందుకు డిసెంబ‌రు 31 దాకా స‌మ‌యమిచ్చింది. వ‌న్ టైం సెటిల్ మెంట్ అవ‌కాశాన్ని వినియోగించుకునేవారు 30 శాతం ప‌న్నును, అంతే మొత్తంలో జ‌రిమానాను చెల్లించాల్సి ఉంటుంది. 2016 ఏప్రిల్ నుంచి అమల్లోకి వ‌చ్చే పార్లమెంటు ఆమోదించిన కొత్త న‌ల్ల‌ధ‌నం చ‌ట్ల […]

విదేశాల్లో దాచిన ఉంచిన న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డికి కేంద్రం మూడు నెల‌ల గ‌డువు ఇచ్చింది. దీనిపై కొత్త చ‌ట్టం కింద విచార‌ణ‌ను త‌ప్పించుకునేందుకు సెప్టెంబ‌రు 30 దాకా అవ‌కాశం క‌ల్పించింది. విదేశీ ఆస్తుల‌కు సంబంధించిన పన్నులు, జ‌రిమానాలు చెల్లించేందుకు డిసెంబ‌రు 31 దాకా స‌మ‌యమిచ్చింది. వ‌న్ టైం సెటిల్ మెంట్ అవ‌కాశాన్ని వినియోగించుకునేవారు 30 శాతం ప‌న్నును, అంతే మొత్తంలో జ‌రిమానాను చెల్లించాల్సి ఉంటుంది. 2016 ఏప్రిల్ నుంచి అమల్లోకి వ‌చ్చే పార్లమెంటు ఆమోదించిన కొత్త న‌ల్ల‌ధ‌నం చ‌ట్ల ప్ర‌కారం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌ని విదేశీ ఆస్తుల‌పై ప‌న్నుతో పాటు 90 శాతం జ‌రిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటివారు విచార‌ణ‌ను ఎదుర్కోవ‌డంతోపాటు ప‌దేళ్ళ వ‌ర‌కు జైలు శిక్ష కూడా అనుభ‌వించాల్సి రావ‌చ్చు.
First Published:  1 July 2015 1:12 PM GMT
Next Story