Telugu Global
Others

మా 120 మంది ఖైదీలేరి?... భారత్‌కు పాక్ ప్రశ్న

భార‌త్ త‌మ‌కు స‌మ‌ర్పించిన జాబితాలో 120 మంది పేర్లు కనబడడం లేదని పాకిస్థాన్ హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. 2008లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత దేశ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను పాక్‌కు, పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత ఖైదీల జాబితాను భారత్‌కు అందించుకోవాలి. సంవత్సరానికి రెండుసార్లు (జనవరి 1, జూలై 1) ఈ ప్రక్రియ జరగాలి. అయితే పాక్‌కు భారత్ బుధవారం సమర్పించిన పాక్ ఖైదీల జాబితాలో 120 మంది […]

భార‌త్ త‌మ‌కు స‌మ‌ర్పించిన జాబితాలో 120 మంది పేర్లు కనబడడం లేదని పాకిస్థాన్ హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. 2008లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారత దేశ జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను పాక్‌కు, పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత ఖైదీల జాబితాను భారత్‌కు అందించుకోవాలి. సంవత్సరానికి రెండుసార్లు (జనవరి 1, జూలై 1) ఈ ప్రక్రియ జరగాలి. అయితే పాక్‌కు భారత్ బుధవారం సమర్పించిన పాక్ ఖైదీల జాబితాలో 120 మంది పేర్లు మిస్సయ్యాయని పాక్ ఆరోపిస్తోంది. ‘భారత్ అందించిన జాబితాలో 27 జాలర్లతో సహా 278 మంది తమ జైళ్లలో ఉన్నట్టు పేర్కొంది. అయితే త‌మ‌ రికార్డుల ప్రకారం 398 మంది భారత్ జైళ్లలో ఉండాల‌ని, కాని 120 మంది త‌క్కువ‌గా లెక్క తేలింద‌ని పాక్ హై కమిషన్ ప్రతినిధి తెలిపారు.

First Published:  1 July 2015 1:17 PM GMT
Next Story