Telugu Global
Cinema & Entertainment

బస్తీ సినిమా రివ్యూ

రేటింగ్: 1.5/5 రాజకీయాల్లోకి వారసులు వచ్చినట్టుగానే సినిమాల్లోకి వారసులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మన నెత్తినెక్కి మనం అలవాటు పడేలా పాటుపడుతున్నారు. కొన్నాళ్ళకి మనమూ అలవాటు పడుతున్నాము. కొత్తనీరు రాకుండా వారసత్వము కొనసాగింపు ఇక్కడికే పరిమితం కాలేదు. తెలుగు సినిమా కథా కథనాల్లో కూడా ఇదే ఒరవడి. అదే సినిమా. చొక్కా విప్పి తిరగేసి వేసుకున్నట్టు.. మాసిన చొక్కా మళ్ళీ మళ్ళీ వేసుకోవడం యెంత కష్టమో.. తీసిన సినిమా తీస్తే మాత్రం చూసిందే చూడడం చాలా కష్టం.  అందుకు బస్తీ సినిమా మినహాయింపు కాదు!  తెలుగునాట […]

బస్తీ సినిమా రివ్యూ
X

రేటింగ్: 1.5/5

రాజకీయాల్లోకి వారసులు వచ్చినట్టుగానే సినిమాల్లోకి వారసులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మన నెత్తినెక్కి మనం అలవాటు పడేలా పాటుపడుతున్నారు. కొన్నాళ్ళకి మనమూ అలవాటు పడుతున్నాము. కొత్తనీరు రాకుండా వారసత్వము కొనసాగింపు ఇక్కడికే పరిమితం కాలేదు. తెలుగు సినిమా కథా కథనాల్లో కూడా ఇదే ఒరవడి. అదే సినిమా. చొక్కా విప్పి తిరగేసి వేసుకున్నట్టు.. మాసిన చొక్కా మళ్ళీ మళ్ళీ వేసుకోవడం యెంత కష్టమో.. తీసిన సినిమా తీస్తే మాత్రం చూసిందే చూడడం చాలా కష్టం. అందుకు బస్తీ సినిమా మినహాయింపు కాదు!

తెలుగునాట సహజనటి జయసుధ కాంట్రిబ్యూషన్ తక్కువేమీ కాదు, సావిత్రి తరువాత సావిత్రి. ఆమె కొడుకు తెరకు పరిచయం అవుతున్నాడంటే సహజమైన ఆసక్తి వుంటుంది. మీడియా ప్రచారం కూడా బస్తీ మీద దృష్టి వుండేలా చేసింది. అయితే తెరంగేట్రం చేసినప్పుడు ప్రచారానికన్నా ముందు కథ మీద కథనం మీద దృష్టి పెట్టాలి. కథని ఎలా ఎన్నుకున్నా అది ఎటుకటు అమీబాలా పోకూడదు.. పోతే జనం లేచి పోతారు.. బస్తీ దాటి పోతారు..

అమ్మిరాజు (ముఖేష్ రుషి)- భిక్షపతి (కోటా శ్రీనివాసరావు) యిద్దరూ ఒకప్పుడు వెంకటపతి నాయుడు దగ్గర పని చేసి యిప్పుడు వైరి వర్గీయులుగా వున్నారు. అమ్మిరాజు సైలెంట్ అయిపోయినా భిక్షపతి కొడుకు భవాని(అభిమన్యు సింగ్) కయ్యానికి కాలు దువ్వుతూనే వుంటాడు. అమ్మిరాజు మనిషి తాలూకా కూతుర్ని రేప్ చేసి మర్డర్ చేసి పడేయడంతో వేడిగా కథ మొదలయినట్టు చెప్పి మరీ కథ మొదలవుతుంది. దాంతో అమ్మిరాజు- భిక్షపతి కూతురు స్రవంతి(ప్రగతి చౌరాసియా)ని ఎత్తుకొచ్చి తన యింట్లో దాస్తాడు. భిక్షపతి కన్నా భవానీ కన్నా పోలీసు అధికారి భార్గవ ఎక్కువ ఆందోళన పడతాడు, సిటి అల్లకల్లోలమవుతుందని. ఇంతలో తెలుగు సినిమాల్లోని అందరు హీరోల్లానే మన హీరో విజయ్(శ్రేయాన్) విదేశాల నుండి బస్తీకి వస్తాడు. దాచిపెట్టిన స్రవంతి ప్రేమలో పడిపోతాడు. స్రవంతీ పడిపోతుంది. అమ్మిరాజూ ఒప్పుకుంటాడు. ఎందుకంటే విజయ్ ఎవరో కాదు, వేంకటపతి నాయుడు కొడుకు. యస్పీ భార్గవ మీడియేటర్గా మీటింగ్.. భిక్షపతి ఒప్పుకున్నా భవాని ఒప్పుకోడు. యస్పీ భార్గవనీ, తండ్రి భిక్షపతినీ, అమ్మిరాజుని చంపేస్తాడు. తప్పించుకున్న ప్రేమ జంట ఎలా ఒక్కటయింది అన్నదే తెరమీద మిగతా కథ!

ఫస్ట్ఆఫ్ ఎలాగోలా నడిచినా సెకండాఫ్ మనని బ్రహ్మ లోకాలకి తీసుకు వెళుతుంది. కామిడీ పేరుతొ కథ నుండి డీవియేట్ అయిపోయి ఎక్కడెక్కడో తిరిగి కథ సుఖాంతమవుతుంది. ప్రేమికులు గాయాలతో మిగిలినట్టే ప్రేక్షకులూ గాయాలతో మిగులుతారు! హీరో హీరోయిన్ ల గురించి వారి నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్వీయ దర్శకత్వం వహించిన వాసు మంతెన తానూ తోవ తప్పి మిగతా టెక్నీషియన్లనీ తోవ తప్పించాడు. ఆలీ, సప్తగిరిల కామిడీ ట్రాకులు అమరలేదు. ఓ రెండు పాటల్లో లోకేషన్లు తప్ప ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు!

First Published:  3 July 2015 4:09 AM GMT
Next Story