అదో పిచ్చివాడి కథ.. వదిలేయండి: కేసీఆర్ 

రాజు క‌న్నా పిచ్చివాడు బ‌ల‌వంతుడు… ఇది నానుడి. ఇది స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోయింది కేసీఆర్ మాట‌ల‌కు. ఎందుకంటే తెలంగాణ‌లో నేడు ఏకైక నాయ‌కుడు ఎవ‌రంటే… ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు అని ఎవ‌రిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కాని ఆయ‌న కూడా త‌న క‌న్నా బ‌ల‌వంతుడు ఎవ‌ర‌య్యా అంటే పిచ్చివాడు అని ముక్తాయింపు ఇచ్చారు. ఇంత‌కీ ఎవ‌రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశారో ఇప్ప‌టికే మీకు అర్ధ‌మై ఉంటుంది. గురువారం నిర్వ‌హించిన విలేఖ‌రుల స‌మావేశం చివ‌ర‌లో మీపై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు… దీనిపై మీ స్పంద‌న ఏమిటి అని ప్ర‌శ్నించ‌గా అదో పిచ్చివాడి క‌థ. వ‌దిలేయండి అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చెల‌రేగి ఇష్టానుసారం కేసీఆర్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో దునుమాడితే ఆయ‌న మాత్రం రేవంత్‌ని పిచ్చోడిగా పోలుస్తూ పూచిక‌పుల్ల‌గా తీసి ప‌డేశారు.