రోడ్డు ప్ర‌మాదంలో హేమ‌మాలినికి గాయాలు!

డ్రీమ్ గ‌ర్ల్ హేమామాలిని రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. గురువారం రాత్రి 8.50 గంట‌ల‌కు మ‌ధురా నుంచి జైపూర్ వెళ్తుండ‌గా హేమ ప్ర‌యాణిస్తున్న బెంజ్ కారు దోస్తా వ‌ద్ద ఎదురుగా వ‌స్తున్న ఆల్టోను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆల్టోకారులో ప్ర‌యాణిస్తున్న నాలుగేళ్ల చిన్నారి సోన‌మ్ మ‌ర‌ణించింది. మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హేమ‌మాలిని కుడిక‌న్ను క‌నుబొమ్మ గాయ‌మ‌వ‌డంతో ఆమె మొహ‌మంతా ర‌క్తంతో త‌డిసిపోయింది. ప్ర‌మాదం అనంత‌రం ఆమె పొర్టీస్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె బాగానే ఉన్నార‌ని స‌న్నిహితులు పేర్కొన్నారు.