Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 132

ఆమె: నిన్న మా డోర్‌ బెల్‌ రిపేరు చెయ్యడానికి వచ్చింది నువ్వేనా? అతను: అవునండీ! రెండుసార్లు బెల్‌ నొక్కాను. ఎవరూ తెరవకపోయేసరికి వెళ్ళిపోయాను. —————————————————– భోంచేస్తూ “డాడీ! పదినిముషాలకు ముందు నేను నా ముగ్గురు మిత్రులు ఒక ముసలావిడను రోడ్డు దాటించాం” అన్నాడు సునీల్‌. “ఔన్రా! నేను కూడా చూశాను. మరీ మీరు ఆవిడను ఎత్తుకుని రోడ్డు దాటిస్తున్నారు. ఆవిడకు ఆరోగ్యం బాగాలేదా?” అన్నాడు తండ్రి. “అదేం కాదు డాడీ! ఆవిడకు రోడ్డు దాటడం ఇష్టంలేదు” అన్నాడు. […]

ఆమె: నిన్న మా డోర్‌ బెల్‌ రిపేరు చెయ్యడానికి వచ్చింది నువ్వేనా?
అతను: అవునండీ! రెండుసార్లు బెల్‌ నొక్కాను. ఎవరూ తెరవకపోయేసరికి వెళ్ళిపోయాను.
—————————————————–
భోంచేస్తూ “డాడీ! పదినిముషాలకు ముందు నేను నా ముగ్గురు మిత్రులు ఒక ముసలావిడను రోడ్డు దాటించాం” అన్నాడు సునీల్‌.
“ఔన్రా! నేను కూడా చూశాను. మరీ మీరు ఆవిడను ఎత్తుకుని రోడ్డు దాటిస్తున్నారు. ఆవిడకు ఆరోగ్యం బాగాలేదా?” అన్నాడు తండ్రి.
“అదేం కాదు డాడీ! ఆవిడకు రోడ్డు దాటడం ఇష్టంలేదు” అన్నాడు.
—————————————————–
ఫాదర్‌ దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి “ఫాదర్‌ నేను పాపం చేశాను. ఒక కొబ్బరి బోండాంని బావిలోకి తోశాను”.
“కొబ్బరిబోండాంని బావిలోకి తొయ్యడం పెద్ద పాపం కాదు” అన్నాడు ఫాదర్‌.
ఇంకో కుర్రాడు వచ్చి అలాగే చెప్పాడు. పాపం కాదన్నాడు ఫాదర్‌.
మూడో కుర్రాడు వచ్చాడు. “నువ్వు కూడా కొబ్బరిబొండాంని నీళ్ళలోకి తోశావా?” అన్నాడు ఫాదర్‌.
“కాదు ఫాదర్‌, నేను ఆ కొబ్బరిబోండాంని” అన్నాడా కుర్రాడు.
—————————————————–
ముగ్గురు స్నేహితులు స్కూలుకు సెలవు రోజున మాట్లాడుకుంటున్నారు
ఒకడు: ఒక వన్‌రూపీ కాయిన్‌ని గాల్లోకి ఎగరేద్దాం. అది బొమ్మ చూపిస్తే స్విమ్మింగ్‌ఫూల్‌కి వెళదాం. బొరుసు చూపిస్తే క్రికెట్‌ ఆడుదాం.
ఇంకొకడు: ఏదీ చూపకుండా నిలబడితే?
అతడు: హోంవర్క్‌ చేద్దాం.

First Published:  2 July 2015 1:03 PM GMT
Next Story