Telugu Global
Cinema & Entertainment

లోఫర్ కు ముహూర్తం ఖరారైంది

పూరి జగన్నాధ్-వరుణ్ తేజ సినిమాకు డేట్ ఫిక్సయింది. ఈ వీక్ లోనే లోఫర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. పూరి అయితే ఇప్పటికే బ్యాంకాక్ చేరుకున్నాడు. లోఫర్ సినిమా కథ, స్క్రీన్ ప్లేకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. తన పని క్లయిమాక్స్ కు రావడంతో ఈ వారంలోనే ఓపెనింగ్ పెట్టుకోమని కూడా సూచించాడు. దీంతో లోఫర్ సినిమా షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు క్రిష్ […]

లోఫర్ కు ముహూర్తం ఖరారైంది
X
పూరి జగన్నాధ్-వరుణ్ తేజ సినిమాకు డేట్ ఫిక్సయింది. ఈ వీక్ లోనే లోఫర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. పూరి అయితే ఇప్పటికే బ్యాంకాక్ చేరుకున్నాడు. లోఫర్ సినిమా కథ, స్క్రీన్ ప్లేకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. తన పని క్లయిమాక్స్ కు రావడంతో ఈ వారంలోనే ఓపెనింగ్ పెట్టుకోమని కూడా సూచించాడు. దీంతో లోఫర్ సినిమా షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న కంచె సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు వరుణ్ తేజ. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ 20శాతం పనిని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు. మొత్తమ్మీద ఈనెలలో ఒకేసారి రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొంటాడు వరుణ్ తేజ. హీరోలను ఎగ్రెసివ్ గా ప్రజెంట్ చేసే పూరి జగన్నాధ్, వరుణ్ తేజను ఎలా చూపించబోతున్నాడనే ఉత్కంఠ మెగాఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. టైటిల్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో ప్రాజెక్ట్ క్రేజీగా మారింది.
First Published:  3 July 2015 6:25 AM GMT
Next Story