Telugu Global
Others

పూజారుల పంచాయితీ..

పుష్క‌రాలు త‌రుముకొస్తున్నాయి. వివాదాలూ పుష్క‌లంగా పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టికే వేల కోట్లతో చేస్తున్న ప‌నుల్లో అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా పంతుళ్ల పంచాయితీ తెర‌పైకొచ్చింది. పుష్క‌రాల్లో పిండ‌ప్ర‌దానాల వంటి తీర్థ విధులు నిర్వ‌హించే పురోహితుల మధ్య ప్రాంతీయ విభేదాలు పొడ‌సూపాయి. పుష్క‌ర ఘాట్‌ల వ‌ద్ద‌ తీర్థ విధులు నిర్వ‌హించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాల‌ని దేవాదాయ‌శాఖ నిర్ణ‌యించింది. దీనికోసం ద‌ర‌ఖాస్తులు కూడా ఆహ్వానించింది. అయితే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌క్క‌న‌పెట్టేవార‌ని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం అంటే ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి […]

పూజారుల పంచాయితీ..
X
పుష్క‌రాలు త‌రుముకొస్తున్నాయి. వివాదాలూ పుష్క‌లంగా పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టికే వేల కోట్లతో చేస్తున్న ప‌నుల్లో అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. తాజాగా పంతుళ్ల పంచాయితీ తెర‌పైకొచ్చింది. పుష్క‌రాల్లో పిండ‌ప్ర‌దానాల వంటి తీర్థ విధులు నిర్వ‌హించే పురోహితుల మధ్య ప్రాంతీయ విభేదాలు పొడ‌సూపాయి. పుష్క‌ర ఘాట్‌ల వ‌ద్ద‌ తీర్థ విధులు నిర్వ‌హించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాల‌ని దేవాదాయ‌శాఖ నిర్ణ‌యించింది. దీనికోసం ద‌ర‌ఖాస్తులు కూడా ఆహ్వానించింది. అయితే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌క్క‌న‌పెట్టేవార‌ని శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం అంటే ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన పురోహితులు ఆరోపిస్తున్నారు. పుష్క‌రాల తీర్థ విధులు ఒక్క ఉభ‌య‌గోదావ‌రి జిల్లా పురోహితులే నిర్వ‌హించాల‌నుకుంటున్నార‌ని ఇది చాలా అన్యాయ‌మ‌ని ఉత్త‌రాంధ్ర పంతుళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల వారి వాద‌న మ‌రో విధంగా ఉంది. 12 ఏళ్ల‌కు ఒక సారి వ‌చ్చే పుష్క‌రాల‌ప్పుడు త‌మ‌కు వ‌చ్చే ఆదాయాన్ని ఇతర జిల్లాల వాళ్లు త‌న్నుకుపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల పురోహితులు. వాద‌న‌లు వినిపించ‌డ‌మే కాదు..ఇరుప్రాంతాల వారూ ధ‌ర్నాలకు దిగి త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఒక‌రు పుష్క‌ర తీర్థ విధులు నిర్వ‌హించేవారికి ఐడీకార్డులుండాల‌ని ప‌ట్టుబ‌డుతుంటే..మ‌రొక‌రు వ‌ద్దంటున్నారు. మొత్తానికి పంతుళ్ల పంచాయితీ దేవాదాయ‌శాఖ అధికారులు దిగితేనే గానీ ప‌రిష్కార‌మ‌య్యేలా లేదు.
First Published:  3 July 2015 1:29 AM GMT
Next Story