Telugu Global
Cinema & Entertainment

మరోసారి బాలయ్య సరసన..

బాలయ్యకు ఓ భామ నచ్చిందంటే అంతే.. వెంటవెంటనే అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సోనాల్ చౌహాన్ విషయంలో కూడా అదే జరిగింది. లెజెండ్ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది సోనాల్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో సోనాల్ తో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. అందుకే తన 99వ సినిమాలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. శ్రీవాస్ దర్శక-నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా […]

మరోసారి బాలయ్య సరసన..
X
బాలయ్యకు ఓ భామ నచ్చిందంటే అంతే.. వెంటవెంటనే అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సోనాల్ చౌహాన్ విషయంలో కూడా అదే జరిగింది. లెజెండ్ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది సోనాల్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో సోనాల్ తో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. అందుకే తన 99వ సినిమాలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. శ్రీవాస్ దర్శక-నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా ఎంపికచేశారు. నిజానికి ఈ సినిమాలో మొదట రాధిక ఆప్టేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి ఆ స్థానంలో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. చూస్తుంటే.. బాలయ్య వందో సినిమాలో కూడా సోనాల్ చౌహాన్ నే హీరోయిన్ గా తీసుకుంటారేమో. రీసెంట్ గా పండగ చేస్కో సినిమాతో మరో హిట్ అందుకుంది సోనాల్ చౌహాన్. బాలయ్య సినిమాలో ఆఫర్ రావడానికి ఇది కూడా ఓ కారణం. కోన వెంకట్-గోపీ మోహన్ కలిసి కథ అందిస్తున్న బాలయ్య 99వ సినిమాకు డిక్టేటర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
First Published:  3 July 2015 6:32 AM GMT
Next Story