Telugu Global
Others

వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్‌

స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో డిఎస్పీ పట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి ఆయ‌న‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. పోలీసుల వాహనాలను భూమా అనుచరులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రత్యేక వాహనంలో పోలీసులు భూమాను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ వాహనాన్ని […]

స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో డిఎస్పీ పట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి ఆయ‌న‌ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. పోలీసుల వాహనాలను భూమా అనుచరులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రత్యేక వాహనంలో పోలీసులు భూమాను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ వాహనాన్ని ముందుకు పోనీయకుండా భూమా అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని పక్కకు నెట్టేసి భూమాను తీసుకువెళ్లారు. దీంతో సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
First Published:  2 July 2015 1:30 PM GMT
Next Story