Telugu Global
NEWS

అస‌ల‌క్క‌డ ఏం జ‌రిగిందంటే..

భూమా అఖిల‌ప్రియ వివ‌ర‌ణ‌ పోలీసులే త‌మ‌కు అకార‌ణంగా దూషించి ఆ త‌ర్వాత మాపైనే త‌ప్పుడు కేసు బ‌నాయించార‌ని కర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన వివాదంలో అఖిల‌ప్రియ తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెల్సిందే. అక్క‌డ జ‌రిగిన వివాదానికి ఆమే ప్ర‌త్య‌క్ష సాక్షి. అక్క‌డేం జ‌రిగిందో ఆమె మీడియాకు వివ‌రించారు. వివ‌రాలు ఆమె మాట‌ల్లోనే.. “ఓటువేయ‌డానికి నేను, నాన్న క‌ల‌సి వెళ్లాం. […]

అస‌ల‌క్క‌డ ఏం జ‌రిగిందంటే..
X
భూమా అఖిల‌ప్రియ వివ‌ర‌ణ‌
పోలీసులే త‌మ‌కు అకార‌ణంగా దూషించి ఆ త‌ర్వాత మాపైనే త‌ప్పుడు కేసు బ‌నాయించార‌ని కర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన వివాదంలో అఖిల‌ప్రియ తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెల్సిందే. అక్క‌డ జ‌రిగిన వివాదానికి ఆమే ప్ర‌త్య‌క్ష సాక్షి. అక్క‌డేం జ‌రిగిందో ఆమె మీడియాకు వివ‌రించారు. వివ‌రాలు ఆమె మాట‌ల్లోనే.. “ఓటువేయ‌డానికి నేను, నాన్న క‌ల‌సి వెళ్లాం. క్యూ ఎక్కువ‌గా ఉంద‌ని ప‌దినిమిషాలు కూర్చోవాల‌ని పోలీసులు చెప్పారు. నాన్న బ‌య‌ట‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత ఏఎస్పీ, డీఎస్పీ వ‌చ్చి వెంట‌నే ఓటేసే న‌న్ను వెళ్లిపొమ్మ‌న్నారు. నాన్న వ‌స్తే ఇద్ద‌రం ఓటేసి వెళ్లిపోతామ‌ని చెప్పాను. కానీ వారు విన‌లేదు. చాలా క‌ఠినంగా, ప‌రుష‌ప‌దాల‌తో దూషించారు. నేను కూర్చొన్న చోటు నుంచి క‌దిలిందీ లేదు.. ఓటేసేవారితో మాట్లాడిందేం లేదు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పోలీసుల‌పై వ‌త్తిడి తీసుకురావ‌డంతోనే పోలీసులు అలా బిహేవ్ చేశారు. పోలీసులు దూషిస్తున్న స‌మ‌యంలోనే నాన్న వ‌చ్చారు. ఒక మ‌హిళ అందులోనూ ఎమ్మెల్యేపై అలా దురుసుగా ఎందుకు మాట్లాడుతున్నార‌ని పోలీసుల‌ను నిల‌దీశారు. ఒక తండ్రిగానే ఆయ‌న రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేను, మ‌హిళ‌ను అలా దూషించి బైట‌కు పంపాల‌ని మీ రూల్స్‌లో ఉందా అని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. దానికే ఆయ‌న‌పై ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. చాలా సిల్లీగా ఉంది ఇది. వాళ్లు ఏ కేసు పెట్టినీ సిల్లీ రీజ‌న్ల‌కే పెడుతున్నారు. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్ల‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలోనూ ఇలానే అనేక‌సార్లు త‌ప్పుడు కేసులు పెట్టారు.”
First Published:  3 July 2015 11:53 PM GMT
Next Story