Telugu Global
Cinema & Entertainment

నితిన్ తో త్రివిక్రమ్ మూవీ

సన్నాఫ్ సత్యామూర్తి తర్వాత త్రివిక్రమ్ ఖాళీ అయిపోయాడు. పవన్ తో సినిమా చేద్దామనుకుంటే పవర్ స్టార్ బిజీ అయిపోయాడు. మహేష్ తో మూవీ ప్లాన్ చేశాడు. కానీ ప్రిన్స్ మరో 6 నెలల వరకు ఖాళీగా లేడు. అటు ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నాడు. కానీ యంగ్ టైగర్ కూడా సుకుమార్ సినిమాతో బిజీ అయిపోయాడు. అందుకే ఎవరైనా మరో హీరోతో లో-బడ్జెట్ లో సినిమా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే హీరో నితిన్ […]

నితిన్ తో త్రివిక్రమ్ మూవీ
X
సన్నాఫ్ సత్యామూర్తి తర్వాత త్రివిక్రమ్ ఖాళీ అయిపోయాడు. పవన్ తో సినిమా చేద్దామనుకుంటే పవర్ స్టార్ బిజీ అయిపోయాడు. మహేష్ తో మూవీ ప్లాన్ చేశాడు. కానీ ప్రిన్స్ మరో 6 నెలల వరకు ఖాళీగా లేడు. అటు ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నాడు. కానీ యంగ్ టైగర్ కూడా సుకుమార్ సినిమాతో బిజీ అయిపోయాడు. అందుకే ఎవరైనా మరో హీరోతో లో-బడ్జెట్ లో సినిమా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే హీరో నితిన్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వచ్చే అవకాశముంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో నితిన్ సరసన సమంత నటించే అవకాశముంది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించిన సమంత, త్రివిక్రమ్ కోసం కొన్ని కాల్షీట్లు సిద్ధంగా ఉంచింది. హీరో ఎవరైనా సరే.. త్రివిక్రమ్ తో మళ్లీ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉంది. సో.. సమీకరణాలు అన్నీ సెట్టయితే నితిన్-సమంత-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే అవకాశముంది.
First Published:  4 July 2015 4:00 AM GMT
Next Story