Telugu Global
Others

కేసీఆర్ మీటింగ్‌లో రైతుకు చీవాట్లు!

మీటింగ్‌ల‌కు వ‌చ్చే జ‌నం… విన‌డానికే రావాలి, అడ‌గ‌డానికి కాదు… అన్న‌ట్టుంది తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర‌రావు వైఖ‌రి. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి హుస్నాబాద్ వచ్చిన ఆయ‌న స‌హ‌జ‌శైలిలో ఆ ప్రాంతానికి సాగునీరు తెస్తామ‌ని, స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికి ఓ రైతు అడ్డం వచ్చారు. మిడ్‌ మానేరు నుంచి, కాళేశ్వర ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరు తీసుకువచ్చి హుస్నాబాద్‌ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్‌ అంటుండగా తోటపల్లి రిజర్వాయర్‌ గురించి ఆ రైతు ప్రస్తావించారు. […]

కేసీఆర్ మీటింగ్‌లో రైతుకు చీవాట్లు!
X
మీటింగ్‌ల‌కు వ‌చ్చే జ‌నం… విన‌డానికే రావాలి, అడ‌గ‌డానికి కాదు… అన్న‌ట్టుంది తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర‌రావు వైఖ‌రి. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి హుస్నాబాద్ వచ్చిన ఆయ‌న స‌హ‌జ‌శైలిలో ఆ ప్రాంతానికి సాగునీరు తెస్తామ‌ని, స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికి ఓ రైతు అడ్డం వచ్చారు. మిడ్‌ మానేరు నుంచి, కాళేశ్వర ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరు తీసుకువచ్చి హుస్నాబాద్‌ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్‌ అంటుండగా తోటపల్లి రిజర్వాయర్‌ గురించి ఆ రైతు ప్రస్తావించారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారు. అలాంటప్పుడు నీరేలా తీసుకు వస్తారని ఒగులాపూర్‌కు చెందిన మహిపాల్‌ రెడ్డి అనే రైతు ప్రశ్నించారు. ఈ సమయంలో అతనిని కేసీఆర్‌ తీవ్ర పదజాలంతో మందలించారు. ‘‘ఏయ్‌..! అరవకు. పిచ్చోడిలా.. నీకే బాగా తెలుసా.. నాకు తెలియదా, నాకన్న నీకు ఎక్కువ తెలుసా.. తోటపల్లి రిజర్వాయర్‌ కడితే నీళ్లు తెస్తావా? నాకే అడ్డం మాట్లాడతావా? బుద్ధుందా లేదా అడిగేందుకు. అక్కడొకడు.. ఇక్కడొకడు.. తయారైండు. వినే తెలివి ఉండాలి’’ అంటూ కోపడ్డారు. మహిపాల్‌రెడ్డిని బయటకు పంపాలని పోలీసులు ప్రయత్నించగా, కేసీఆర్‌ వారిని అడ్డుకొన్నారు. ‘‘అతడిని అక్కడే ఉండనివ్వనీయండి’’ అంటూ పోలీసులను వెనక్కి పిలిపించారు. సభ ముగిసేదాకా.. ఆగిన పోలీసులు ఆ తరువాత మహిపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వరదకాలువ నిర్మాణంలో భాగంగా తోటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు టెండర్లు పిలిచారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.2 కోట్ల 56 లక్షలు వెచ్చించారు. పనులు ఆలస్యంగా చేస్తున్నారనే కారణంగా కాంట్రాక్టును రద్దు చేశారు. ఈ క్రమంలో రిజర్వాయర్‌ను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నదన్న వార్తలతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని మహిపాల్‌రెడ్డి భావించారని సభకు వచ్చిన తోటి రైతులు చెబుతున్నారు. అయితే, మహిపాల్‌ ‘తోటపల్లి’ అనగానే కేసీఆర్‌ మందలించడంతో ఆయన దిక్కుతోచక ఉండిపోయారని, ఇంతలో పోలీసులు తీసుకెళ్లిపోయారని చెబుతున్నారు.
First Published:  4 July 2015 11:30 PM GMT
Next Story