Telugu Global
Others

సివిల్స్‌లో విక‌లాంగురాలికి టాప్ ర్యాంక్!

అంగ‌వైక‌ల్యం గ‌ల‌ ఢిల్లీకి చెందిన ఐరా సింఘాల్ ల‌క్ష్యం ఐఏఎస్‌. కాని ఆమె 2011 సివిల్స్‌ పరీక్షల్లో ఐఆర్‌ఎస్‌ సాధించారు! అయినా వెన్నుకు సంబంధించిన అంగ వైకల్యం ఉందన్న కారణంతో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. కానీ, ఆమె క్యాట్‌కు వెళ్లి పోరాడి మరీ ఆరు నెలల కిందటే హైదరాబాద్‌లో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఐఏఎస్ కావాల‌న్న కోరిక‌తో ఆరోసారి 2014లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు! ఈసారి సివిల్స్‌ టాపర్‌గా నిలిచారు! సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన […]

సివిల్స్‌లో విక‌లాంగురాలికి టాప్ ర్యాంక్!
X
అంగ‌వైక‌ల్యం గ‌ల‌ ఢిల్లీకి చెందిన ఐరా సింఘాల్ ల‌క్ష్యం ఐఏఎస్‌. కాని ఆమె 2011 సివిల్స్‌ పరీక్షల్లో ఐఆర్‌ఎస్‌ సాధించారు! అయినా వెన్నుకు సంబంధించిన అంగ వైకల్యం ఉందన్న కారణంతో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. కానీ, ఆమె క్యాట్‌కు వెళ్లి పోరాడి మరీ ఆరు నెలల కిందటే హైదరాబాద్‌లో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఐఏఎస్ కావాల‌న్న కోరిక‌తో ఆరోసారి 2014లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు! ఈసారి సివిల్స్‌ టాపర్‌గా నిలిచారు! సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి వికలాంగ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇక, సివిల్స్‌ పరీక్షల్లో మొదటి నాలుగు స్థానాలనూ మహిళలే కైవసం చేసుకున్నారు. వారిలోనూ ముగ్గురు దేశ రాజధాని ఢిల్లీకి చెందినవారే! సివిల్‌ సర్వీస్‌ 2014 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శనివారం విడుదల చేసింది. 1236 మందితో జాబితా ప్రకటించింది. వీరిలో 590 మంది జనరల్‌; 354 మంది ఓబీసీ; 194 మంది ఎస్సీ; 98 మంది ఎస్టీ కేటగిరీకి చెందినవాళ్లు. ఇక, మొదటి ప్రయత్నంలోనే రెండో ర్యాంకును సాధించారు కొట్టాయంకు చెందిన డాక్టర్‌ రేణూ రాజ్. ఢిల్లీకి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి నిధి గుప్తా మూడో ర్యాంకును దక్కించుకున్నారు. ఢిల్లీకే చెందిన వందనారావు మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు. ఓబీసీ విభాగంలో ఆమే అగ్రస్థానంలో నిలిచారు. ఈసారి సివిల్స్‌ పరీక్షల్లో పురుషుల్లో టాప్‌ ర్యాంకు అంటే ఐదో ర్యాంకే! ఢిల్లీలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన సుహర్ష భగత్‌ సివిల్స్‌లో ఐదో ర్యాంకును, పురుషుల్లో మొదటి ర్యాంకును సాధించారు. కాగా, సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశానికి సేవచేసే ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించారని, అందుకు తన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు
First Published:  4 July 2015 9:49 PM GMT
Next Story