Telugu Global
Cinema & Entertainment

నిబద్ధతకు మారుపేరు

సాధారణంగా ఓ సినిమా ఒప్పుకున్న వెంటనే అడ్వాన్స్ తీసుకొని సెట్స్ పైకి వెళ్లిపోతాడు ఏ హీరో అయినా. కానీ రజనీకాంత్ మాత్రం తన డెడికేషన్ ను మరోసారి రుజువుచేసుకున్నారు. తను తలుచుకుంటే ఏకంగా సినిమా సెట్స్ పైనే సన్నివేశం వినొచ్చు. తను నటించిందే ఫైనల్ కావొచ్చు. డైరక్టర్ కు కట్ చెప్పే అవకాశం కూడా రాదు. కానీ రజనీకాంత్ మాత్రం అలా చేయలేదు. తన కొత్త సినిమాకు సంబంధించి రిహార్సల్స్ కు హాజరయ్యాడు సూపర్ స్టార్. దర్శకుడు […]

నిబద్ధతకు మారుపేరు
X
సాధారణంగా ఓ సినిమా ఒప్పుకున్న వెంటనే అడ్వాన్స్ తీసుకొని సెట్స్ పైకి వెళ్లిపోతాడు ఏ హీరో అయినా. కానీ రజనీకాంత్ మాత్రం తన డెడికేషన్ ను మరోసారి రుజువుచేసుకున్నారు. తను తలుచుకుంటే ఏకంగా సినిమా సెట్స్ పైనే సన్నివేశం వినొచ్చు. తను నటించిందే ఫైనల్ కావొచ్చు. డైరక్టర్ కు కట్ చెప్పే అవకాశం కూడా రాదు. కానీ రజనీకాంత్ మాత్రం అలా చేయలేదు. తన కొత్త సినిమాకు సంబంధించి రిహార్సల్స్ కు హాజరయ్యాడు సూపర్ స్టార్. దర్శకుడు రంజిత్ నిర్వహిస్తున్న రిహార్సల్ క్లాసులకు హాజరై తన నిబద్ధత, క్రమశిక్షణను మరోసారి నిరూపించాడు రజనీకాంత్. రిహార్సల్స్ లో నటించి తన బాడీ లాంగ్వేజ్ లో ఏమైనా మార్పులు ఉంటే చెప్పమని కూడా రంజిత్ ను అడిగాడట రజనీకాంత్. అసలే రంజిత్ అనే దర్శకుడు కుర్రదర్శకుడు. రజనీకాంత్ లాంటి సీనియర్ నటుడు తనను అలా సలహాలు అడిగేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ నెలాఖరుకు రిహార్సల్స్ పూర్తిచేసుకొని, వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్తుంది రజనీకాంత్ నయామూవీ.
First Published:  4 July 2015 7:04 PM GMT
Next Story