Telugu Global
Cinema & Entertainment

కృష్ణ‌వంశీ ఎక్క‌డ‌బ్బా...!

కృష్ణ‌వంశీ. కుటంబ క‌థా చిత్రాలు చేయ‌డంలో  మంచి మార్క్ వున్న ద‌ర్శ‌కుడు. అలాగే  సింధూరం, అంతఃపురం వంటి చిత్రాల‌తో త‌న మేథ‌స్సును చాటుకున్న దర్శ‌కుడు.  స్వ‌త‌హాగా  ప‌ర్ఫెకక్ష‌న్ కోరుకునే ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. మేకింగ్ విష‌యంలో  నిర్మాత‌ల నుంచి   ఈ ద‌ర్శ‌కుడి పై  ఫిర్యాదులున్నాయి.  చెప్పిన బ‌డ్జెట్ లో సినిమాను  చేయ‌డు. అలాగే చెప్పిన స‌మ‌యంలోను సినిమా చేయ‌లేడ‌నే  కంప్లైంట్స్ వున్నాయి. క‌ట్ చేస్తే. గోవిందుడు అందిరివాడేలే చిత్రం  కు ముందు కృష్ణ‌వంశీ  కి  చాల గ్యాప్ వ‌చ్చింది. […]

కృష్ణ‌వంశీ ఎక్క‌డ‌బ్బా...!
X

కృష్ణ‌వంశీ. కుటంబ క‌థా చిత్రాలు చేయ‌డంలో మంచి మార్క్ వున్న ద‌ర్శ‌కుడు. అలాగే సింధూరం, అంతఃపురం వంటి చిత్రాల‌తో త‌న మేథ‌స్సును చాటుకున్న దర్శ‌కుడు. స్వ‌త‌హాగా ప‌ర్ఫెకక్ష‌న్ కోరుకునే ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. మేకింగ్ విష‌యంలో నిర్మాత‌ల నుంచి ఈ ద‌ర్శ‌కుడి పై ఫిర్యాదులున్నాయి. చెప్పిన బ‌డ్జెట్ లో సినిమాను చేయ‌డు. అలాగే చెప్పిన స‌మ‌యంలోను సినిమా చేయ‌లేడ‌నే కంప్లైంట్స్ వున్నాయి.

క‌ట్ చేస్తే. గోవిందుడు అందిరివాడేలే చిత్రం కు ముందు కృష్ణ‌వంశీ కి చాల గ్యాప్ వ‌చ్చింది. ఆయ‌న స‌క్సెస్ ట్రాక్ లో వున్న‌ప్పుడు పెద్ద హీరోల‌తో చిత్రాలు చేయ‌క పోవ‌డం వంటి రీజ‌న్స్ తో చాల గ్యాప్ వ‌చ్చింది. అయితే రాంచ‌ర‌ణ్, చిరు పుణ్య‌మా అని గోవిందుడు అందిరివాడేలే చిత్రంతో కొంత పుంజుకున్నాడు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ సైలెంట్ వ‌ర్క్ చేస్తూ.. సందీప్ కిష‌న్‌తో ప్రాజెక్ట్ చేయ‌డానికి రంగం సిద్దం చేసుకున్నాడ‌ని ఇంట‌ర్న‌ల్ టాక్.

దిల్ రాజ్ నిర్మాణంలో ఈ చిత్రం వుంటుంద‌ని స‌మాచారం. బీరువా చిత్రం త‌రువాత సందీప్ కిష‌న్ టైగ‌ర్ చిత్రంతో కూడా మ‌రో స‌క్సెస్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ కిష‌న్ తో చేయ‌బోయో ప్రాజెక్ట్ క‌చ్చితంగా కృష్ణ‌వంశీ కెరీర్ కు మ‌రింత హెల్ప్ అవుతుంద‌ని టాక్. మొత్తం మీద ఈ యేడాది కృష్ణ‌వంశీ సినిమా వుంటుంద‌న‌కోవ‌చ్చు మ‌రి.

First Published:  4 July 2015 7:01 PM GMT
Next Story