Telugu Global
Cinema & Entertainment

మరోసారి రెహ్మాన్ తో అమీర్ ఖాన్  

అమిర్ ఖాన్-ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ అంటే ఎవరికైనా గుర్తొచ్చే సినిమాలు లగాన్, రంగ్ దే బసంతి. ఈ రెండు సినిమాలతో పాటు మంగళ్ పాండే లాంటి మరికొన్ని సినిమాలు కూడా వీళ్లిద్దరి కాంబోలో వచ్చాయి. ఎటొచ్చీ చెప్పొచ్చేదేంటంటే వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. కొత్త దర్శకుడు అద్వైత్ చౌహాన్ దర్శకత్వంలో నటించేందుకు అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించేందుకు ఏఆర్ రెహ్మాన్ కూడా అంగీకరించాడు. […]

మరోసారి రెహ్మాన్ తో అమీర్ ఖాన్  
X

అమిర్ ఖాన్-ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ అంటే ఎవరికైనా గుర్తొచ్చే సినిమాలు లగాన్, రంగ్ దే బసంతి. ఈ రెండు సినిమాలతో పాటు మంగళ్ పాండే లాంటి మరికొన్ని సినిమాలు కూడా వీళ్లిద్దరి కాంబోలో వచ్చాయి. ఎటొచ్చీ చెప్పొచ్చేదేంటంటే వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. కొత్త దర్శకుడు అద్వైత్ చౌహాన్ దర్శకత్వంలో నటించేందుకు అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహించేందుకు ఏఆర్ రెహ్మాన్ కూడా అంగీకరించాడు. ఈ విషయాన్ని ఏ ఆర్ రెహ్మాన్ కన్ ఫర్మ్ చేశారు. లగాన్, రంగ్ దే బసంతి తరహాలోనే ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ సినిమాకు రెహ్మాన్ అయితేనే బాగుంటుందని భావించిన అమీర్ ఖాన్, మరోసారి అతడ్ని కలిసి సినిమాకు సంగీతదర్శకత్వం వహించాల్సిందిగా అభ్యర్థించాడు. దీంతో వీళ్ల కాంబినేషన్ మరోసారి సెట్టయింది. ప్రస్తుతం అమీర్ దంగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే అద్వైత్ సినిమా మొదలవుతుంది. ఓవైపు దంగల్ సినిమా చేస్తూనే మరోవైపు అద్వైత్ సినిమా స్క్రీన్ ప్లే పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు అమీర్.

First Published:  5 July 2015 7:02 PM GMT
Next Story