Telugu Global
Cinema & Entertainment

నాని-మారుతి సినిమా అప్ డేట్స్

హీరో నాని, డైరక్టర్ మారుతి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పేరు భలే భలే మగాడివోయ్. సైలెంట్ గా షూుటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లాంటి రెండు పెద్ద సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ టాకీపార్ట్ కంప్లీట్ అయింది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం అయిపోయిందని నాని […]

నాని-మారుతి సినిమా అప్ డేట్స్
X
హీరో నాని, డైరక్టర్ మారుతి కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పేరు భలే భలే మగాడివోయ్. సైలెంట్ గా షూుటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లాంటి రెండు పెద్ద సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ టాకీపార్ట్ కంప్లీట్ అయింది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం అయిపోయిందని నాని స్వయంగా ప్రకటించాడు. ఈ నెలాఖరుకు మిగిలిన రెండు పాటల షూటింగ్ పూర్తిచేసి, వచ్చే నెల రెండోవారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు నాని. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో క్లీన్ హిట్ అందుకున్న నాని, భలే భలే మగాడివోయ్ సినిమాతో మరోసారి రేసులోకి రావాలనుకుంటున్నాడు. పైసా, జెండాపై కపిరాజు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో మారుతి సినిమాతో మరోసారి సత్తా చాటాలనుకుంటున్నాడు. అటు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతోంది. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన మారుతి కూడా ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు.
First Published:  5 July 2015 7:06 PM GMT
Next Story