Telugu Global
Cinema & Entertainment

వచ్చే ఏడాది కూడా బాహుబలే..

ప్రస్తుతం బాహుబలి పార్ట్-1 మాత్రమే విడుదలవుతోంది. ఇంకా పార్ట్-2 మిగిలే ఉంది. దాని షూటింగ్ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఇదే సమయానికి బాహుబలి పార్ట్-2ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే బాహుబలి పార్ట్-1 విడుదలైన తర్వాత ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ ను పట్టాలపైకి తీసుకొస్తాడనే ప్రచారం సాగింది. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో కలిసి ఓ రొమాంటిక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడనే వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలికే ఫిక్స్ అయ్యాడు. పార్ట్-1 […]

వచ్చే ఏడాది కూడా బాహుబలే..
X
ప్రస్తుతం బాహుబలి పార్ట్-1 మాత్రమే విడుదలవుతోంది. ఇంకా పార్ట్-2 మిగిలే ఉంది. దాని షూటింగ్ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఇదే సమయానికి బాహుబలి పార్ట్-2ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే బాహుబలి పార్ట్-1 విడుదలైన తర్వాత ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ ను పట్టాలపైకి తీసుకొస్తాడనే ప్రచారం సాగింది. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ తో కలిసి ఓ రొమాంటిక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడనే వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలికే ఫిక్స్ అయ్యాడు. పార్ట్-1 విడుదలైన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి పార్ట్-2 ప్రారంభిస్తానంటున్నాడు ప్రభాస్. సెప్టెంబర్ 15 నుంచి బాహుబలి పార్ట్-2 షూటింగ్ ప్రారంభమౌతుందని కూడా ప్రకటించాడు. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టైమ్ ఉంటే మరో సినిమా గురించి ఆలోచిస్తానని, లేదంటే 2016 మొత్తం బాహుబలితోనే అయిపోతుందంటున్నాడు ప్రభాస్. అంటే.. ఇప్పటికే గడిచిన మూడేళ్లతోపాటు మరో ఏడాది కూడా ప్రభాస్ నుంచి బాహుబలి తప్ప మరోటి ఆశించడానికి లేదు.
First Published:  6 July 2015 5:01 AM GMT
Next Story