Telugu Global
Cinema & Entertainment

మహేష్ తో కమ్ముల సినిమా..?

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ టాలీవుడ్ అంతా ఇదే విషయం కోడై కూసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడనే పుకారు క్షణాల్లో వ్యాపించింది. శ్రీమంతుడు సెట్స్ లోనే మహేష్ ను కమ్ముల కలిశాడని, స్టోరీలైన్ వినిపించాడని ఆ వార్త సారాంశం. స్టోరీలైన్ విన్న వెంటనే మహేష్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని, బ్రహ్మోత్సవం తర్వాత కమ్ములతోనే కలిసి సెట్స్ పైకి వెళ్తాడని రూమర్ పుట్టుకొచ్చింది. దీంతో అంతా ఆరాలు […]

మహేష్ తో కమ్ముల సినిమా..?
X
వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ టాలీవుడ్ అంతా ఇదే విషయం కోడై కూసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడనే పుకారు క్షణాల్లో వ్యాపించింది. శ్రీమంతుడు సెట్స్ లోనే మహేష్ ను కమ్ముల కలిశాడని, స్టోరీలైన్ వినిపించాడని ఆ వార్త సారాంశం. స్టోరీలైన్ విన్న వెంటనే మహేష్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని, బ్రహ్మోత్సవం తర్వాత కమ్ములతోనే కలిసి సెట్స్ పైకి వెళ్తాడని రూమర్ పుట్టుకొచ్చింది. దీంతో అంతా ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన కమ్ముల, ఈ దెబ్బతో తనకు తానుగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మహేష్ తో తను సినిమా చేయట్లేదని స్పష్టంచేశాడు శేఖర్ కమ్ముల. అసలు తన నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటివరకు ఆలోచించలేదంటున్నాడు కమ్ముల. అలాంటప్పుడు మహేష్ కు స్టోరీలైన్ వినిపించాననడంలో అర్థంలేదంటున్నాడు. మొత్తానికి శేఖర్ కమ్ముల క్లారిటీతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
First Published:  5 July 2015 7:01 PM GMT
Next Story