ఈసారైనా హిట్ కొడుతుందా..

నందినీ రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. అవును.. సింగిల్ మూవీ వండర్ డైరక్టర్ గా పేరుతెచ్చుకుంది నందినీరెడ్డి. అలా మొదలైంది సినిమాతో ఆమె తెలుగులో సెన్సేషన్ సృష్టించింది. అయితే ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన జబర్దస్త్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు మెగాఫోన్ పట్టుకోవడం మానేసింది నందినీరెడ్డి. మళ్లీ ఇన్నేళ్లకు ఓ సినిమా మొదలుపెట్టింది. నాగశౌర్య హీరోగా ఓ క్యూట్ లవ్ ఎంటర్ టైనర్ ను షురూచేసింది నందినీరెడ్డి. అలా మొదలైంది సినిమాను నిర్మించిన రంజిత్ మూవీస్ బ్యానర్ పైనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుండడంతో సెంటిమెంట్ బలంగానే ఉంది. అలా మొదలైంది సినిమా కోసం ప్రత్యేకంగా నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్న నందినీరెడ్డి, ఈసారి అంతే ప్రత్యేకంగా మాళవిక నాయర్ ను సెలక్ట్ చేసుకుంది. తాజా సినిమాతోనైనా నందినీరెడ్డి హిట్ అందుకోవాలని ఆశిద్దాం.