Telugu Global
NEWS

ఓటుకు నోటు కేసులో సండ్ర‌కు 14 రోజుల రిమాండ్‌

ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధ‌క శాఖ అరెస్ట్ చేసిన‌ ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. ఎమ్మెల్యే అయినందున ఆయ‌న్ని ప్ర‌త్యేక ఖైదీగా ప‌రిగ‌ణించాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో త‌న‌కు బెయిల్ పిటిష‌న్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ సండ్ర న్యాయ‌వాది దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైనా, త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైన విచార‌ణ‌ను కోర్టు రేప‌టికి […]

ఓటుకు నోటు కేసులో సండ్ర‌కు 14 రోజుల రిమాండ్‌
X
ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధ‌క శాఖ అరెస్ట్ చేసిన‌ ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. ఎమ్మెల్యే అయినందున ఆయ‌న్ని ప్ర‌త్యేక ఖైదీగా ప‌రిగ‌ణించాల‌ని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో త‌న‌కు బెయిల్ పిటిష‌న్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ సండ్ర న్యాయ‌వాది దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైనా, త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పైన విచార‌ణ‌ను కోర్టు రేప‌టికి వాయిదా వేసింది. సండ్రకు విధించిన జ్యుడీషియ‌ల్ రిమాండు ప్ర‌కారం ఆయ‌న ఈ నెల 21 వ‌ర‌కు జైలులో ఉంటారు. ప్ర‌స్తుతం సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లిస్తున్నారు.
First Published:  7 July 2015 3:39 AM GMT
Next Story