చంద్ర‌బాబే అస‌లు దొంగ: బీవీ రాఘ‌వులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజ‌కీయాల్లో కూడా సంచ‌ల‌నం రేపిన ఓటుకు కోట్లు వ్య‌వ‌హారంపై సీపీఎం నేత బీవీ రాఘ‌వులు ఘాటుగా స్పందించారు. రాజ‌కీయ నాయ‌కులు తమ స్వార్ధం కోస‌మే ఈ కేసును ఉప‌యోగించుకుంటున్నార‌ని తెలుగుదేశం, టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య ఆట‌గా ఓటుకు కోట్ల వ్య‌వ‌హారం మారింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఇంకా తాను నీతిప‌రుడ‌న‌న్న‌ట్టు మాట‌లు చెబుతున్నారు…క‌న్నంలో దొంగ‌లా దొరికి పోయిన త‌ర్వాత కూడా ఈ ఆట‌లేంటి అంటూ రాఘ‌వులు ప్ర‌శ్నించారు. సీఎం చంద్ర‌బాబు మాట్లాడిన టేపులు కూడా బైట‌ప‌డ్డాయి. అందులో మాట‌లు ఆయ‌న‌వే. అయినా వీటిని క‌ప్పి పెట్టుకోడానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ఉదంతాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంటే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఢిల్లీలో ఆరోపించారు.