Telugu Global
Others

గోదావ‌రి పుష్క‌రాలు మొద‌లైపోయాయా?

గోదావ‌రి పుష్క‌రాలు ఈనెల 14 నుంచి కాదా? కాదు.. మంగ‌ళ‌వారం నుంచే మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌క‌టించారు పంచాంగ‌క‌ర్త, శ్రీశైల దేవ‌స్థానం ఆస్థాన పండితుడు బుట్టే వీర‌భ‌ద్ర దైవ‌జ్ఞ శ‌ర్మ‌. అంతేకాదు స‌కుటుంబంగా గోదావ‌రికి వెళ్లి పుష్క‌ర‌స్నానాలు కూడా చేశారు. ఆయ‌న బాట‌లోనే వేలాదిమంది మంది భ‌క్తులు కూడా పుష్క‌ర స్నానాలు ఆచ‌రించారు. విజ‌య‌దుర్గ పీఠాధిప‌తి వెదురుపాక గాడ్ కూడా భ‌క్తుల‌తో క‌లిసి ఇవాళే పుష్క‌ర‌స్నానాలు చేశారు. పంచాంగ‌క‌ర్త‌ల మ‌ధ్య పంచాయితీ: గోదావ‌రి పుష్క‌రాల నేప‌థ్యంలో పంచాంగ‌క‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు […]

గోదావ‌రి పుష్క‌రాలు మొద‌లైపోయాయా?
X

గోదావ‌రి పుష్క‌రాలు ఈనెల 14 నుంచి కాదా? కాదు.. మంగ‌ళ‌వారం నుంచే మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌క‌టించారు పంచాంగ‌క‌ర్త, శ్రీశైల దేవ‌స్థానం ఆస్థాన పండితుడు బుట్టే వీర‌భ‌ద్ర దైవ‌జ్ఞ శ‌ర్మ‌. అంతేకాదు స‌కుటుంబంగా గోదావ‌రికి వెళ్లి పుష్క‌ర‌స్నానాలు కూడా చేశారు. ఆయ‌న బాట‌లోనే వేలాదిమంది మంది భ‌క్తులు కూడా పుష్క‌ర స్నానాలు ఆచ‌రించారు. విజ‌య‌దుర్గ పీఠాధిప‌తి వెదురుపాక గాడ్ కూడా భ‌క్తుల‌తో క‌లిసి ఇవాళే పుష్క‌ర‌స్నానాలు చేశారు.
పంచాంగ‌క‌ర్త‌ల మ‌ధ్య పంచాయితీ:
గోదావ‌రి పుష్క‌రాల నేప‌థ్యంలో పంచాంగ‌క‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. జులై 7 నుంచి పుష్క‌రాల ఆరంభ‌మ‌ని రాజ‌మండ్రికి చెందిన‌ బుట్టే సిద్ధాంతి చెబుతుంటే..గ‌త‌నెల 28 నుంచి మొద‌లైపోయాయంటున్నారు మ‌రో పంచాంగ‌క‌ర్త మ‌ధుర కృష్ణ‌మూర్తిశాస్త్రి. ఆయ‌న కూడా వంద‌లాదిమంది శిష్యుల‌తో గ‌త‌నెలలోనే పుష్క‌ర స్నానాలు చేశారు. అయితే మ‌ధుర‌వారిది సూర్య‌మాన సిద్ధాంతం., బుట్టే సిద్ధాంతిది చంద్ర‌మాన సిద్ధాంతం! అయితే ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయ‌డం మంచిదికాదంటున్నారు మ‌రికొంత‌మంది పండితులు. ఏపీ ప్ర‌భుత్వం 14 నుంచి పుష్క‌రాల‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. ఆ తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు. క‌నీసం కృష్ణా పుష్క‌రాల‌కు ముందైనా పంచాంగ క‌మిటీని వేసి తేదీల‌పై గంద‌ర‌గోళం క‌లుగ‌కుండా చూడాల‌ని కోరుతున్నారు.

First Published:  6 July 2015 11:22 PM GMT
Next Story