Telugu Global
Others

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు: జస్టిస్‌ లక్ష్మణ్‌రావు

మద్యాన్ని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూడడం మానుకోవాలని  మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ అంబటి లక్ష్మణ్‌రావు సూచించారు. మద్యం నియంత్రణ కోసం మహిళలు సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యాన్ని నియంత్రించి ప్రభుత్వాన్ని నడపలేరా అని పాలకులను ప్రశ్నించారు. దీన్ని ఆదాయ వనరులుగా చూస్తుండడం వల్లన ప్రజలు తీవ్ర నష్టానికి గురౌతున్నారని, లక్షల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులు అధికమవుతున్నాయని, ఇవి సామాజిక […]

మద్యాన్ని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూడడం మానుకోవాలని మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ అంబటి లక్ష్మణ్‌రావు సూచించారు. మద్యం నియంత్రణ కోసం మహిళలు సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యాన్ని నియంత్రించి ప్రభుత్వాన్ని నడపలేరా అని పాలకులను ప్రశ్నించారు. దీన్ని ఆదాయ వనరులుగా చూస్తుండడం వల్లన ప్రజలు తీవ్ర నష్టానికి గురౌతున్నారని, లక్షల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులు అధికమవుతున్నాయని, ఇవి సామాజిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. బెల్టు షాపులను అంగీకరించమని ఎన్నికలకు ముందు కేసీఆర్‌, బెల్టు షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని కానీ ఆచరణ మాత్రం భిన్నంగా ఉందన్నారు.
First Published:  6 July 2015 1:20 PM GMT
Next Story