Telugu Global
Others

అవినీతిపై  20న దేశ‌వ్యాప్త నిర‌స‌న 

ఎన్డీఏ ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న అవినీతి కుంభ‌కోణాల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 20న దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని ఆరు లెఫ్ట్ పార్టీలు నిర్ణ‌యించాయి. మోడీ ప్ర‌భుత్వం కార్పోరేట్ అనుకూల‌, కార్మిక వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా సెప్టెంబ‌రు 2వ తేదీన కార్మిక సంఘాలు చేప‌ట్ట‌నున్న నిర‌స‌న‌లో పాల్గొనాల‌ని లెఫ్ట్ పార్టీల స‌మావేశం తీర్మానించింది. ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌మావేశంలో  సీతారాం ఏచూరి, ప్ర‌కాష్ కార‌త్ (సీపీఎం), సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి, డీ రాజా (సీపీఐ), దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌, స్వ‌ప‌న్ ముఖ‌ర్జీ ( […]

ఎన్డీఏ ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న అవినీతి కుంభ‌కోణాల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 20న దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని ఆరు లెఫ్ట్ పార్టీలు నిర్ణ‌యించాయి. మోడీ ప్ర‌భుత్వం కార్పోరేట్ అనుకూల‌, కార్మిక వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా సెప్టెంబ‌రు 2వ తేదీన కార్మిక సంఘాలు చేప‌ట్ట‌నున్న నిర‌స‌న‌లో పాల్గొనాల‌ని లెఫ్ట్ పార్టీల స‌మావేశం తీర్మానించింది. ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌మావేశంలో సీతారాం ఏచూరి, ప్ర‌కాష్ కార‌త్ (సీపీఎం), సుర‌వ‌రం సుధాక‌ర‌రెడ్డి, డీ రాజా (సీపీఐ), దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌, స్వ‌ప‌న్ ముఖ‌ర్జీ ( సీపీఐ -ఎంఎల్ లిబ‌రేష‌న్‌), దేవ‌రాజ‌న్ (ఫార్వ‌ర్డ్ బ్లాక్‌), ప్రాణ్‌శ‌ర్మ (ఎస్‌యూసీఐ), అబ‌నీరాయ్ (ఆర్ ఎస్పీ)లు పాల్గొన్నారు.
First Published:  6 July 2015 1:05 PM GMT
Next Story