Telugu Global
Others

వంద కోట్లు దాటిన ఫోన్ క‌నెక్ష‌న్లు 

భార‌త‌దేశంలో ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య వంద కోట్ల‌కు చేరింద‌ని టెలికం శాఖ మంత్రి ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. దీంతో టెలిఫోన్ల వాడ‌కంలో  భార‌త్ ఒక కొత్త మైలురాయిని అధిగ‌మించింద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ట్రాయ్ స‌మ‌ర్పించిన నివేదిక ప్ర‌కారం  దేశ‌వ్యాప్తంగా 99.97 కోట్ల మందికి టెలిఫోన్ కనెక్ష‌న్లుండ‌గా, అందులో 97.8 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌ని మంత్రి చెప్పారు.  కొత్త ఫోన్ క‌నెక్ష‌న్ తీసుకుంటున్న వారి సంఖ్య నెల‌కు 50 నుంచి […]

వంద కోట్లు దాటిన ఫోన్ క‌నెక్ష‌న్లు 
X
భార‌త‌దేశంలో ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య వంద కోట్ల‌కు చేరింద‌ని టెలికం శాఖ మంత్రి ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. దీంతో టెలిఫోన్ల వాడ‌కంలో భార‌త్ ఒక కొత్త మైలురాయిని అధిగ‌మించింద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ట్రాయ్ స‌మ‌ర్పించిన నివేదిక ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా 99.97 కోట్ల మందికి టెలిఫోన్ కనెక్ష‌న్లుండ‌గా, అందులో 97.8 కోట్ల మంది మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌ని మంత్రి చెప్పారు. కొత్త ఫోన్ క‌నెక్ష‌న్ తీసుకుంటున్న వారి సంఖ్య నెల‌కు 50 నుంచి 70 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటోంద‌ని, అలాగే 30 కోట్ల మంది ఇంట‌ర్నెట్ వినియోగిస్తున్నార‌ని, వ‌చ్చే రెండేళ్ల‌లో ఈ సంఖ్య‌ను 50 కోట్ల‌కు పెంచాల‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అన్నారు. జాతీయ టెలికం పాల‌సీ 2012 ప‌థ‌కం ద్వారా త‌క్కువ ధ‌ర‌కే బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లందిస్తామ‌ని, వ‌చ్చే రెండేళ్ల‌లో 17.5 కోట్ల మందికి ఈ సేవ‌లు విస్త‌రిస్తామ‌ని మంత్రి అన్నారు. 2020 నాటికి సెక‌నుకు 2 మెగాబైట్స్ డౌన్‌లోడ్ వేగంతో ఇంట‌ర్నెట్ స‌ర్వీసులు అందించాల‌న్న‌ది కేంద్రం ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎంటీఎన్ఎల్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీ-డాట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న దూర ప్రాంతాల‌కు వై-ఫై, సోలార్ ఆధారంగా వై-ఫై స‌ర్వీసులందించే ప‌రిక‌రాల‌ను విడుద‌ల చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు.
First Published:  7 July 2015 12:19 AM GMT
Next Story