శ్రీమంతుడు ఆడియో డీటెయిల్స్

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీమంతుడు. బాహుబలి సినిమా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. కేవలం సినిమానే కాదు.. ఆడియో ఫంక్షన్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. నిజానికి ఈ పాటికే శ్రీమంతుడు పాటలు మార్కెట్లోకి వచ్చి ఉండాల్సింది. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తేదీని, వేదికను ఖరారు చేశారు. ఈనెల 18న శ్రీమంతుడు పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. గతంలో మహేష్-దేవి కాంబినేషన్ లో వన్-నేనొక్కడినే సినిమా వచ్చింది. ఆడియో ఫంక్షన్ వేదికపై దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకంగా ఓ షో చేయబోతున్నాడు. ఆగస్ట్ 7న శ్రీమంతుడు సినిమాను విడుదల చేస్తారు. సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శృతిహాసన్ తో పాటు జగపతిబాబు, ఆమని, రాహుల్ రవీంద్రన్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపిస్తారు.