Telugu Global
Others

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల మండిపాటు...

ఓటుకు నోటు కేసు విషయంలో తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండు ప్ర‌భుత్వాలు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే.. అది అంత‌ర్యుద్ధానికి దారి తీస్తుంద‌ని వ‌ప‌న్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఇంకా ప‌రిణితి సాధించ‌ని ప‌వ‌న్ అవ‌గాహ‌నలేమికి నిద‌ర్శ‌నంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. కేసులో  సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా బాగానే క‌వ‌ర్ చేశార‌ని విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. చంద్ర‌బాబుపై కేసు పెడితే సెక్ష‌న్‌-8ను తెర‌పైకి తీసుకొస్తారా? […]

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల మండిపాటు...
X

ఓటుకు నోటు కేసు విషయంలో తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెండు ప్ర‌భుత్వాలు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే.. అది అంత‌ర్యుద్ధానికి దారి తీస్తుంద‌ని వ‌ప‌న్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే ఇందుకు కార‌ణం. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఇంకా ప‌రిణితి సాధించ‌ని ప‌వ‌న్ అవ‌గాహ‌నలేమికి నిద‌ర్శ‌నంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. కేసులో సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కుండా బాగానే క‌వ‌ర్ చేశార‌ని విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. చంద్ర‌బాబుపై కేసు పెడితే సెక్ష‌న్‌-8ను తెర‌పైకి తీసుకొస్తారా? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు. అంటే హైద‌రాబాద్‌లో సెక్ష‌న్‌-8, శాంతి భ‌ద్ర‌త‌ల అంశం లేవ‌నెత్తిందే చంద్ర‌బాబు అండ్ పార్టీ అని ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. అలాంట‌పుడు రెండు రాష్ర్టాల ప్ర‌జ‌ల మ‌ధ్య యుద్ధం జర‌గ‌బోతుంద‌ని ప‌వ‌న్ కు స‌మాచారం ఎలా ఉంది? ఇది దేశానికి హెచ్చ‌రికా? లేదంటే కేసీఆర్ ప్ర‌భుత్వానికి హెచ్చరిక‌నా? అని హైద‌రాబాదీలు మండిప‌డుతున్నారు. అస‌లు అంత‌ర్యుద్ధం అనే మాట‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అర్థం తెలుసా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అంత‌ర్యుద్ధం అంటే సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు అని.. మీరు చెబితే ప్ర‌జ‌లు కొట్టుకోవాలా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వ్య‌వ‌హారానికి సూత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబును వీస‌మెత్తు మాట‌న‌కుండా విశ్వాసం భ‌లే ప్ర‌ద‌ర్శించాడ‌ని టీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్ర్కిప్టును త‌న మాట‌లుగా చెప్పాడ‌ని ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల కొనుగోలు విష‌యం, ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ప‌న్నిన ప్ర‌య‌త్నం గురించి ప‌న్నెత్తి మాట్టాడ‌ని ప‌వ‌న్‌కు, అంత‌ర్యుద్ధం అనే ప‌దం ఉచ్ఛ‌రించేందుకు అర్హ‌త ఉందా? అని ఎగ‌తాళి చేస్తున్నారు. మ‌రోవైపు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్య‌లను కేంద్ర నిఘావ‌ర్గాలు రికార్డు చేసి ఉంటాయ‌ని, ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో చిక్కులు కొనితెచ్చుకోవ‌డ‌మెందుకు? అని ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

First Published:  7 July 2015 12:40 AM GMT
Next Story