Telugu Global
National

చచ్చిపోతానేమో?... ఉమాభారతి భయం!

వ్యవసాయక్‌ పరీక్షా మండలి (వ్యాపం) కేసు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు కూడా ఉందని, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే చచ్చిపోతానేమోనని భయమేస్తుందని, మంత్రిగా ఉన్న నాకే ఇలా ఉంటే ఇక అమాయకులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి. మద్యప్రదేశ్‌లో కిల్లింగ్‌ స్కాంగా పేరు మోసిన వ్యాపం మృత్యుహేల సొంత పార్టీ నేతలనే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ స్కాంలో జర్నలిస్టు, నిందితులు, సాక్షులు, విచారణాధికారులు… ఇలా ఒకరి […]

చచ్చిపోతానేమో?... ఉమాభారతి భయం!
X
వ్యవసాయక్‌ పరీక్షా మండలి (వ్యాపం) కేసు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు కూడా ఉందని, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే చచ్చిపోతానేమోనని భయమేస్తుందని, మంత్రిగా ఉన్న నాకే ఇలా ఉంటే ఇక అమాయకులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి. మద్యప్రదేశ్‌లో కిల్లింగ్‌ స్కాంగా పేరు మోసిన వ్యాపం మృత్యుహేల సొంత పార్టీ నేతలనే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ స్కాంలో జర్నలిస్టు, నిందితులు, సాక్షులు, విచారణాధికారులు… ఇలా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సిఘ్‌ చౌహాన్‌ స్పందించి ఏదో ఒకటి చేయాలని ఆమె సూచించారు. ఈ సంక్షోభం నుంచి పార్టీని, నిజాయితీ పరులైన నాయకులను, అధికారులను బయట పడేయడానికి ఏదో ఒకటి చేయాలని ఆమె కోరారు. మంత్రిగా ఉన్న తననే ఇంత భయానికి గురి చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని, ఈ విషయాన్ని సీఎం చౌహాన్‌ దృష్టికి తీసుకువెళతానని ఆమె అన్నారు. మరోవైపు సీబీఐ విచారణకు ఆదేశించాలన్న అరుణ్‌జైట్లీ వాదనతో ఏకీభవిస్తూ నిజాలు బయటకు రావడానికి ఇదొక్కటే మంచి మార్గమని ఆయన అన్నారు. కాగా 2002లో జరిగిన నియామకాల్లో జరిగిన అక్రమాలపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేరు కూడా ఉంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించినపుడు తన పేరు కూడా చర్చనీయాంశమవుతుందని ఉమా భారతి కలవరపడుతున్నారు.
First Published:  7 July 2015 12:57 AM GMT
Next Story