Telugu Global
Cinema & Entertainment

బాహుబలిపై బన్నీ ప్రశంసలు

బాహుబలిని మెచ్చుకునే స్టార్ల జాబితాలోకి బన్నీ కూడా చేరాడు. కేవలం ఈ సినిమాను పొగడ్డం కోసమే మరోసారి ట్విట్టర్ పేజ్ లోకి ఎంటరయ్యాడు. సినిమా రిలీజ్ కు దగ్గరవుతున్న ఈ తరుణంలో బాహుబలి యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. మరీ ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్, తన ఫ్రెండ్ రానాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాహుబలి సినిమా కేవలం ఓ చిత్రం మాత్రమే కాదని, అది ప్రతి తెలుగువాడికి ఓ గర్వకారణమని అన్నాడు బన్నీ. తెలుగు సినిమా […]

బాహుబలిపై బన్నీ ప్రశంసలు
X
బాహుబలిని మెచ్చుకునే స్టార్ల జాబితాలోకి బన్నీ కూడా చేరాడు. కేవలం ఈ సినిమాను పొగడ్డం కోసమే మరోసారి ట్విట్టర్ పేజ్ లోకి ఎంటరయ్యాడు. సినిమా రిలీజ్ కు దగ్గరవుతున్న ఈ తరుణంలో బాహుబలి యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. మరీ ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్, తన ఫ్రెండ్ రానాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాహుబలి సినిమా కేవలం ఓ చిత్రం మాత్రమే కాదని, అది ప్రతి తెలుగువాడికి ఓ గర్వకారణమని అన్నాడు బన్నీ. తెలుగు సినిమా లెవెల్, స్టామినాను పెంచిన దర్శకుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపాడు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రేపు సాయంత్రం కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో వేసేందుకు సిద్ధమౌతున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి విశ్వనాధ్ థియేటర్ లో తాజా సమాచారం ప్రకారం బెనిఫిట్ షో గరిష్ట ధరను 3వేల రూపాయలుగా నిర్ణయించారు. బాల్కనీ 2వేల రూపాయలు, మిడిల్ లో ఉండే సీట్లకు 15వందల రూపాయలుగా ధరలు నిర్ణయించారు. ఇక అడుగున ఉండే సీట్లకు వెయ్యి రూపాయల ధర నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపు అర్థరాత్రి ఒంటిగంటకు విశ్వనాధ్ థియేటర్ లో బాహుబలి బెనిఫిట్ షో ఉంటుంది. అటు విజయవాడలో కూడా బెనిఫిట్ షోకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండు థియేటర్లలో బాహుబలి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.
First Published:  7 July 2015 11:00 PM GMT
Next Story