Telugu Global
Others

హేమామాలినికి సిగ్గుందా?

చేసింది త‌ప్పు..అది ఒప్పుకోక‌పోగా సిగ్గులేకుండా ఎదురుదాడి చేస్తున్నారు మ‌ధుర ఎంపీ హేమామాలిని. జులై 3న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హేమామాలినికి గాయాలు మాత్ర‌మే అయ్యాయి. కానీ ఆమె కారు ఢీకొన‌డంతో నాలుగేళ్ల చిన్నారి చ‌నిపోయింది. అయితే ఆ ప్ర‌మాదానికి కార‌ణం చిన్నారి తండ్రేనంటూ ఎదురుదాడి చేస్తున్నారు హేమామాలిని. ఆయన డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేయ‌డం వల్లే పాప చ‌నిపోయింద‌ని ఆరోపిస్తున్నారు. బిడ్డ‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ త‌ల్లిదండ్రుల‌ను హేమామాలిని మాట‌లు మ‌రింత బాధ‌పెడుతున్నాయి. చిన్నారిని రోడ్డుమీదే వ‌దిలేశారుః […]

హేమామాలినికి సిగ్గుందా?
X

చేసింది త‌ప్పు..అది ఒప్పుకోక‌పోగా సిగ్గులేకుండా ఎదురుదాడి చేస్తున్నారు మ‌ధుర ఎంపీ హేమామాలిని. జులై 3న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హేమామాలినికి గాయాలు మాత్ర‌మే అయ్యాయి. కానీ ఆమె కారు ఢీకొన‌డంతో నాలుగేళ్ల చిన్నారి చ‌నిపోయింది. అయితే ఆ ప్ర‌మాదానికి కార‌ణం చిన్నారి తండ్రేనంటూ ఎదురుదాడి చేస్తున్నారు హేమామాలిని. ఆయన డ్రైవింగ్ రూల్స్ బ్రేక్ చేయ‌డం వల్లే పాప చ‌నిపోయింద‌ని ఆరోపిస్తున్నారు. బిడ్డ‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ త‌ల్లిదండ్రుల‌ను హేమామాలిని మాట‌లు మ‌రింత బాధ‌పెడుతున్నాయి.
చిన్నారిని రోడ్డుమీదే వ‌దిలేశారుః
జులై 3 రాత్రి హేమామాలిని త‌న‌ మెర్సిడెస్ బెంజ్ కారులో మ‌ధుర నుంచి జైపూర్ వెళ్లే మార్గంలో ప్ర‌మాదం జ‌రిగింది. స్వ‌ల్ప‌గాయానికే స్థానికి బీజేపీ నేత‌లు, అదికారులు హైరానా ప‌డిపోయారు. ఆమెను హుటాహుటీన జైపూర్‌లోని కార్పొరేట్‌ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. కానీ హేమామాలిని కారు ఢీకొన్న ఆల్టో కారులో నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయ‌ప‌డింది. కానీ ఆమెను న‌డిరోడ్డుమీదే వ‌దిలేశారు జిల్లా అధికారులు. చివ‌ర‌కు అంబులెన్స్ వ‌చ్చి జైపూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించేస‌రికి చిన్నారి చ‌నిపోయింది. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స‌కాలంలో త‌న బిడ్డ‌కు చికిత్స అందిస్తే ప్రాణాలు ద‌క్కేవ‌ని చిన్నారి త‌ల్లిదండ్రలు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. ఇంత జ‌రిగినా..క‌నీస ప‌శ్చాత్తాపం లేకుండా చిన్నారి తండ్రిని త‌ప్పుబ‌డుతున్నారు హేమామాలిని.
నివేదిక కోరిన రాజ‌స్థాన్ హెచ్ఆర్‌సి
జులై 3న హేమామాలిని కారు ప్ర‌మాదంలో చిన్నారి మ‌ర‌ణంపై రాజ‌స్థాన్ మాన‌వ హ‌క్కుల సంఘం తీవ్రంగా స్పందించంది. ప్ర‌మాధానికి సంబంధించిన వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని రాజ‌స్థాన్ పోలీసుల‌ను ఆదేశించింది.

First Published:  8 July 2015 1:10 AM GMT
Next Story