Telugu Global
Cinema & Entertainment

రాజ‌మౌళి   మ‌హేష్ బాబు ను ఎలా చూపిస్తాడో..! 

బాహుబ‌లి సినిమా త‌రువాత రాజ‌మౌళి  ఎటుంటి సినిమా చేస్తాడో..అస‌లు ఏ హీరోతో చేస్తాడో అనే స‌స్పెన్స్ కు తెర ప‌డింది.  ప్రిన్స్ మ‌హేష్ బాబు తో   సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు  తెలుస్తుంది.  వీరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో అనే  ఆలోచ‌న  మ‌హేష్ బాబు అభిమానులు ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు.  ఎందుకంటే  ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి  హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధానం  గొప్ప‌గా ఉంటుంది.   ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చిత్రాలన్నీ  అదే విష‌యాన్ని చాటాయి.   […]

రాజ‌మౌళి   మ‌హేష్ బాబు ను ఎలా చూపిస్తాడో..! 
X

బాహుబ‌లి సినిమా త‌రువాత రాజ‌మౌళి ఎటుంటి సినిమా చేస్తాడో..అస‌లు ఏ హీరోతో చేస్తాడో అనే స‌స్పెన్స్ కు తెర ప‌డింది. ప్రిన్స్ మ‌హేష్ బాబు తో సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. వీరి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో అనే ఆలోచ‌న మ‌హేష్ బాబు అభిమానులు ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు. ఎందుకంటే ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధానం గొప్ప‌గా ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చిత్రాలన్నీ అదే విష‌యాన్ని చాటాయి.

ఇక ప్ర‌స్తుతం చేస్తున్న బాహుబ‌లి తో చ‌రిత్ర సృష్టించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ చేయ‌డం.. అలాగే టాలీవుడ్ చ‌రిత్ర‌లో భారీ బ‌డ్జెట్ సినిమా గా రికార్డు.. ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్నీ అంత‌ర్జాతీయంగా ఎలివేట్ చేయ‌డం. ఇలా ఒక్క‌టేమిటి.. బాహుబ‌లి లో ఎంతో సృష్టించాడు. ఇక సినిమా విడుద‌లైన త‌రువాత ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి ఖ్యాతీ ఎక్క‌డ‌కో వెళ్తుంది. ఆయ‌న ఏ హీరోతో చేసినా..ఆ హీరో అభిమానుల‌తో పాటు..స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా భారీగా ఆశిస్తాడు.
మ‌రి ఇటువంటి త‌రుణంలో బాహుబ‌లి సెకండ్ పార్ట్ అయిన త‌రువాత‌.. రాజ‌మౌళి మ‌హేష్ బాబు తో సినిమా చేసే అవ‌కాశం హండ్రెట్ ప‌ర్సెంట్ ఉంది అనేది ఇంట‌ర్నల్ గా వినిపిస్తున్న టాక్. మ‌రి నిజంగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో బాహుబ‌లి 2 త‌రువాత సినిమా వుంటుందా..లేక మ‌రి కొంత కాలం వెయిట్ చేయాలా అనేది తెలియాలంటే .. వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు మ‌రి.

First Published:  7 July 2015 8:00 PM GMT
Next Story