Telugu Global
Cinema & Entertainment

ఆ రూమర్లు నమ్మొద్దు ప్లీజ్.. రామ్

హీరో రామ్ పై ఈమధ్య కొన్ని రూమర్లు హల్ చల్ చేశాయి. అతడు ఓ రీమేక్ సినిమాలో నటిస్తాడనే ప్రచారం బాగా జరిగింది. ఈ పుకార్లు అన్నింటిపై రామ్ స్పందించాడు. తను ఎలాంటి రీమేక్ లో నటించడం లేదని స్పష్టంచేశాడు. మేటర్ లోకి వస్తే.. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్ అనే సినిమా రీమేక్ రైట్స్ ను తెలుగులో స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నాడు. స్వయంగా రవికిషోర్ దక్కించుకోవడంతో, రామ్ ఇక ప్రేమమ్ రీమేక్ లో నటిస్తాడంటూ పుకార్లు వ్యాపించాయి. […]

ఆ రూమర్లు నమ్మొద్దు ప్లీజ్.. రామ్
X

హీరో రామ్ పై ఈమధ్య కొన్ని రూమర్లు హల్ చల్ చేశాయి. అతడు ఓ రీమేక్ సినిమాలో నటిస్తాడనే ప్రచారం బాగా జరిగింది. ఈ పుకార్లు అన్నింటిపై రామ్ స్పందించాడు. తను ఎలాంటి రీమేక్ లో నటించడం లేదని స్పష్టంచేశాడు. మేటర్ లోకి వస్తే.. మలయాళంలో హిట్టయిన ప్రేమమ్ అనే సినిమా రీమేక్ రైట్స్ ను తెలుగులో స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నాడు. స్వయంగా రవికిషోర్ దక్కించుకోవడంతో, రామ్ ఇక ప్రేమమ్ రీమేక్ లో నటిస్తాడంటూ పుకార్లు వ్యాపించాయి. దీనిపైనే క్లారిటీ ఇచ్చాడు రామ్. రీమేక్ రైట్స్ కొన్నది వాస్తవమని చెబుతూనే.. ఇప్పటివరకు ఆ సినిమా గురించి వినడమే తప్ప చూడ్డం జరగలేని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రామ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. హరికథ, శివమ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి కొలిక్కి వచ్చిన తర్వాత ప్రేమమ్ రీమేక్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడు. మసాలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ రీమేక్ సినిమాల్లో నటించనని రామ్ గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

First Published:  7 July 2015 7:00 PM GMT
Next Story