Telugu Global
Cinema & Entertainment

అందుకే ఆయ‌న సూప‌ర్ స్టార్ అయ్యాడు..!

న‌టుడిగా  40 ఏళ్ల ప్ర‌యాణం.  సాధ‌ర‌ణ న‌టుడి నుంచి..  అసాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ స్టార్ గా ఎదిగారు.  ఆయ‌న పేరు చెబితే  బాక్సాఫీస్ క‌ళ క‌ళ లాడుతుంది.   త‌మిళ సినిమాను మార్కెట్ ను అంత‌ర్జాతీయం గా పెంచిన  స్టార్ హీరో.  ఆయ‌న ర‌జ‌నీకాంత్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌వ‌రం లేదు.  అయితే  స్టార్ డ‌మ్ వెనుక ఆయ‌న వ్య‌క్తిత్వం  కూడా  ఉంది.  సాధ‌ర‌ణంగా ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వున్న స్టేజ్ కు  ఒక యువ డైరెక్ట‌ర్ సినిమా కోసం రిహ‌ర్సిల్స్ చేయ‌డం […]

అందుకే ఆయ‌న సూప‌ర్ స్టార్ అయ్యాడు..!
X

న‌టుడిగా 40 ఏళ్ల ప్ర‌యాణం. సాధ‌ర‌ణ న‌టుడి నుంచి.. అసాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ స్టార్ గా ఎదిగారు. ఆయ‌న పేరు చెబితే బాక్సాఫీస్ క‌ళ క‌ళ లాడుతుంది. త‌మిళ సినిమాను మార్కెట్ ను అంత‌ర్జాతీయం గా పెంచిన స్టార్ హీరో. ఆయ‌న ర‌జ‌నీకాంత్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌వ‌రం లేదు. అయితే స్టార్ డ‌మ్ వెనుక ఆయ‌న వ్య‌క్తిత్వం కూడా ఉంది. సాధ‌ర‌ణంగా ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వున్న స్టేజ్ కు ఒక యువ డైరెక్ట‌ర్ సినిమా కోసం రిహ‌ర్సిల్స్ చేయ‌డం అవ‌స‌ర‌మా. నో వే.ఏ మాత్రం అవ‌స‌రం లేదు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ తో సినిమా చేయ‌బోతున్న యువ ద‌ర్శ‌కుడు రంజిత్ కు త‌న ప్ర‌తి సినిమాకు న‌టీ న‌టుల‌తో రిహార్సల్స్ చేయించే అల‌వాటు వుంద‌ట‌. గ‌త రెండు సినిమాల‌కు అలానేచేయించాడ‌ట‌. అయితే ర‌జ‌నీకాంత్ సూప‌ర్ స్టార్ కావ‌డంతో…ఆయ‌ను పిల‌వలేక పోయార‌ట‌. మిగిలిన న‌టీ న‌టుల్ని పిలిపించి రిహార్సల్స్ చేయిస్తున్నార‌ట‌. ఆ విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీకాంత్ వెంట‌నే రిహార్సల్స్ జ‌రుగుతున్న ప్లేస్ కు వెళ్లి.. స‌హ‌న‌టుల‌తో ఒక రూమ్ లో కూర్చున్నార‌ట‌. ఆ గదిలోకి వ‌చ్చిన డైరెక్ట‌ర్ రంజిత్ ..ర‌జ‌నికాంత్ ను చూసి ఒక్క సారిగా స్ట‌న్ అయ్యార‌ట‌. అత‌ను తేరుకునే లోపే.. మీకు రిహ‌ర్స‌ల్స్ చేయిండం అల‌వాట‌ని విన్నాను. అంద‌రం క‌లిసి చేద్దామ‌ని జాయిన్ అయిపోయార‌ట‌. అందుకే ర‌జ‌నీ ఈజ్ ర‌జ‌ని క‌దా…!

First Published:  8 July 2015 7:00 AM GMT
Next Story