Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రెండో స్థానం షాహిద్ కపూర్ దే. మొదటి స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అతడికే తెలీదు. షాహిద్ మాత్రం పెళ్లి చేసుకున్నాడు. గుర్గావ్ లో నిన్న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మీరా రాజ్ పుత్ ను ఘనంగా వివాహమాడాడు షాహిద్. కేవలం 5వందల మంది బంధువులు, 50 మంది స్పెషల్ గెస్టులను మాత్రమే పిలిచారు ఈ పెళ్లికి. అతిధుల్ని తక్కువగా పిలిచినప్పటికీ పెళ్లి మాత్రం గ్రాండ్ […]

ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు
X
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రెండో స్థానం షాహిద్ కపూర్ దే. మొదటి స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అతడికే తెలీదు. షాహిద్ మాత్రం పెళ్లి చేసుకున్నాడు. గుర్గావ్ లో నిన్న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మీరా రాజ్ పుత్ ను ఘనంగా వివాహమాడాడు షాహిద్. కేవలం 5వందల మంది బంధువులు, 50 మంది స్పెషల్ గెస్టులను మాత్రమే పిలిచారు ఈ పెళ్లికి. అతిధుల్ని తక్కువగా పిలిచినప్పటికీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకున్నాడు షాహిద్. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాలీవుడ్ కలరింగ్ కు కాస్త దూరంగా, సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వెంటనే తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టాడు షాహిద్. ఆ వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా షాహిద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రితేష్ దేశ్ ముఖ్-జెనీలియా దంపతులతో పాటు.. బిపాసాబసు, శ్వేతాపండిట్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు షాహిద్ కు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కరీనా కపూర్ తో షాహిద్ కొన్నాళ్లు డేటింగ్ చేశాడు. తర్వాత ప్రియాంక చోప్రాతో క్లోజ్ గా ఉంటున్నాడనే వార్తలొచ్చినప్పటికీ వాటిని ప్రియాంక ఖండించింది. ఫైనల్ గా అన్ని ఎఫైర్లను దాటుకొని మీరా ను పెళ్లాడాడు షాహిద్.
First Published:  7 July 2015 9:00 PM GMT
Next Story